మార్నింగ్‌‌ ఎనర్జీకి యోగా

మార్నింగ్‌‌ ఎనర్జీకి యోగా

రోజంతా పని చేసి అలసిపోతుంటారు చాలా మంది. ఒకే పనిని పదేపదే చేయడం వల్ల బోర్‌‌‌‌ కొడుతుంది. తరువాత రోజు ఆ పని చేయడానికి తగినంత ఎనర్జీ లేదనిపించి లేజీనెస్‌‌ వస్తుంది. లేజీగా ఫీల్‌‌ అయ్యే వాళ్లకు యోగా హెల్ప్‌‌ అవుతుంది. రోజూ మార్నింగ్‌‌ లేచి ఒక గంట చేసే యోగా వల్ల ఆ రోజులో కావల్సిన ఎనర్జీ వస్తుంది. అయితే అందుకోసం కొన్ని యోగాసనాలు వేయాల్సిందే. 

బాలాసనం 
ఈ ఆసనం వేయడం వల్ల స్ట్రెస్‌‌, యాంగ్జైటీ తగ్గడమే కాకుండా, ఛాతి, వీపు, భుజాలపైన పడే ఒత్తిడి తగ్గుతుంది. అంతేకాదు పగటిపూట కలిగే బద్ధకం, అలసటను తగ్గిస్తుంది. బాలాసనం వేయడం వల్ల వీపు, తొడలు, హిప్‌‌, యాంకిల్స్‌‌ బాగాస్ట్రెచ్‌‌ అవుతాయి.

వీరభద్రాసనం
రోజంతా యాక్టివ్‌‌గా ఉండాలంటే ఈ ఆసనం వేయడం బెటర్‌‌‌‌. వీరభద్రాసనం వల్ల భుజాలు బలంగా తయారవుతాయి. శరీరం మీద బ్యాలెన్సింగ్‌‌, స్టెబిలిటీ పెరుగుతుంది. శరీర భాగాలన్నీ స్ట్రెచ్‌‌ అవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. శరీరానికి కావల్సిన శక్తి వస్తుంది.

ధనురాసనం
ఈ ఆసనం కండరాలకు ఉపయోగ పడుతుంది. చేతులు, కాళ్ల దగ్గరి మజిల్స్ గట్టిగా తయారవుతాయి. వెన్నునొప్పిని తగ్గిస్తుంది. రిప్రొడక్టివ్‌‌ సిస్టమ్‌‌ను మెరుగుపరిచి మెనుస్ట్రువల్‌‌ డిసీజ్‌‌ల బారిన పడకుండా సాయపడుతుంది.

త్రికోణాసనం
రెండు కాళ్లను వెడల్పు చేసి, ముందుకు వంగి, చేతులను కుడి ఎడమ పక్కలకు పెడుతూ చేసే ఆసనం ఇది. దీనివల్ల అజీర్తి, గ్యాస్ట్రిక్‌‌, అసిడిటీ సమస్యలు పోతాయి. వెన్నునొప్పి తగ్గి, శరీరం రిలాక్స్‌‌ అవుతుంది.

గరుడాసనం
గరుడ అనేది సంస్కృత పదం. అంటే డేగ అని అర్థం. ఈ ఆసనంతో బాడీ రిలాక్స్‌‌ అయి మైండ్‌‌ ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్‌‌, టెన్షన్‌‌ నుండి రిలీఫ్‌‌ వస్తుంది. చేసే పనుల మీద ఫోకస్‌‌ పెడతారు. శరీరం బ్యాలెన్స్​డ్​గా ఉంటుంది.