
యోగా అనేది మోడీ కోసం కాదని, మన బాడీ కోసమేనని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యోగాకు ప్రాచుర్యం కల్పించడానికి మోడీ కృషి చేశారని ఆయన చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఎర్రకోటలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్యనాయుడు… యోగా ప్రభుత్వ పథకమో, ప్రధాని నరేంద్ర మోడీ పథకమో కాదని అన్నారు. యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చని అన్నారు. తమ ఆరోగ్యం కోసం ప్రజలు దీనిని ఆచరించాలని ఆయన అన్నారు.