యోగా నిత్యజీవితంలో ఒక భాగం కావాలి

యోగా నిత్యజీవితంలో ఒక భాగం కావాలి
  • ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాల్సిందే
  • క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్

మహబూబ్ నగర్/రంగారెడ్డి జిల్లా: ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబూబ్ నగర్ పట్టణంలోని రాయల్ ఫంక్షన్ హాలులో, రంగా రెడ్డి జిల్లా అజీజ్ నగర్ లో కేఎల్ యూనివర్సిటీ, న్యూమాంక్స్ కుంగ్ ఫూ ఆధ్వర్యంలో జరిగిన  అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో  మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులకు ఆటలపై ఆసక్తి, అంతర్జాతీయ స్థాయిలో రాణించే అవకాశాలు కల్పించేందుకు క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. 

కష్టపడి చదువుకున్న క్రమశిక్షణ వల్లే ఉన్నత స్థాయికి..

సినీ నటుడు నరేష్ తో  కేఎల్ యూనివర్సిటీలో జరిగిన యోగాడేలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. విద్యార్థులను ఉత్సాహ పరుస్తూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొద్దిసేపు వారితో ముచ్చటించారు.  అబ్రహం లింకన్, అబ్దుల్ కలాం వంటి మహనీయులు నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారేనని.. వారు చిన్న తనంలో కిలోమీటర్ల దూరం నడచి స్కూళ్లకు వెళ్లారని గుర్తు చేశారు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన మహనీయులందరూ చిన్నప్పటి నుంచి కష్టపడి క్రమశిక్షణతో చదువుకున్న వారేనని తెలిపారు. యోగా ప్రాముఖ్యతను ప్రపంచ వ్యాప్తంగా అందరూ గుర్తించి దైనందిన జీవితంలో యోగాను ఒక భాగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.  అమెరికా వంటి దేశాల్లో యోగా క్లాసులు నిర్వహిస్తే.. యోగా నేర్పించే గురువులకు మంచి గుర్తింపుతోపాటు అత్యధిక వేతనాలు ఇస్తున్న పరిస్థితి ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరించారు.