25న యూపీ సీఎంగా రెండోసారి యోగీ ప్రమాణం

25న యూపీ సీఎంగా రెండోసారి  యోగీ ప్రమాణం

ఈ నెల 25న ఉత్తరప్రదేశ్ సీఎంగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు యోగి ఆదిత్యనాథ్. లక్నో లోని అటల్ బీహారీ వాజ్ పేయ్ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నారు. యోగి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ప్రముఖులు హాజరుకానున్నారు. దాదాపు 50వేల మంది జనం, 200 మంది వీవీఐపీల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, సోనియా గాంధీ, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతితో సహా ప్రతిపక్ష నేతలను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనున్నారు.

For More News..

పోలీసుల అదుపులో ఎమ్మెల్యే రాజాసింగ్

ప్రపంచ కప్ లో భారత్ ఇకపై ప్రతీ మ్యాచ్ గెలవాల్సిందే!

ప్రజలెప్పుడూ మారరు.. నాయకులే మారుతుంటారు