స్పామ్ మెయిల్స్ ని ఒకేసారి డిలీట్ చేయొచ్చు

స్పామ్ మెయిల్స్ ని ఒకేసారి డిలీట్ చేయొచ్చు

స్పామ్ మెయిల్స్ తో జీ మెయిల్ ఇన్ బాక్స్ స్టోరేజ్ ఫుల్ అవుతుంటుంది. దానివల్ల ఇంపార్టెంట్ ఈ మెయిల్స్ అందక ఇబ్బంది పడుతుంటారు. అయితే చాలామందికి స్పామ్ మెయిల్స్ ని ఎలా డిలీట్ చేయాలో తెలియక స్టోరేజ్ కోసం నెలవారి సబ్ స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకుంటారు. గూగుల్ స్టోరేజ్ ని క్లీన్ చేసుకోవడానికి చాలా పద్ధతులున్నాయి. అయితే ఈ స్టెప్స్ ఫాలో అవుతూ జీ మెయిల్ స్టోరేజ్ ని క్లీన్ చేసుకోవచ్చు. 

* ముందు మొబైల్ లేదా కంప్యూటర్లో జీ మెయిల్ లాగిన్ అవ్వాలి. తర్వాత మెయిల్స్ డిలీట్ చేసే ఇన్ బాక్స్, సోషల్, స్పామ్ ఫోల్డర్ లోకి వెళ్లాలి. అక్కడ ఎడమవైపు ఉన్న డౌన్ యారోని క్లిక్ చేసి, చెక్ బాక్స్ పైన క్లిక్ చేయాలి. దానిద్వారా అన్ని మెయిల్స్ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన వాటిని డిలీట్ చేయాలి. అప్పుడు అవన్నీ ట్రాష్ ఫోల్డర్లోకి వెళ్తాయి.

మెయిల్స్ లో కేటగిరి ఉంటుంది. దాంట్లో లేబుల్: అన్ రీడ్, లేబుల్:రీడ్ అని టైప్ చేసి ఎంటర్ నొక్కాలి. అప్పుడు లేబుల్: అన్ రీడ్, లేబుల్:రీడ్ మెయిల్స్ అన్నీ డిస్ ప్లే అవుతాయి. స్క్రీన్ పైన ఉండే సెలక్ట్ ఆల్ బాక్స్ ఆప్షన్ క్లిక్ చేసి సెలక్ట్ ఆల్ కన్వర్జేషన్ పై క్లిక్ చేసి, డిలీట్ ఐకాన్ పై క్లిక్ చేస్తే మెయిల్స్ అన్నీ డిలీట్ అవుతాయి.

* లేదా సెర్చ్ బాక్స్ లో హాస్:అటాచ్మెంట్ లార్జ్:10ఎం అని సెర్చ్ చేయాలి. తర్వాత మెయిల్స్ ని సెలక్ట్ చేసి డిలీట్ చేయాలి. తర్వాత ట్రాష్ లోకి వెళ్లి ఎంప్టీ ట్రాష్ క్లిక్ చేస్తే మెయిల్స్ అన్నీ డిలీట్ అవుతాయి.