తినాలె ఎట్లుందో చెప్పాలె.. గంటకు ₹1400

తినాలె ఎట్లుందో చెప్పాలె.. గంటకు ₹1400
  • గంటకు ₹1400.. డొమినోస్​ జాబ్​ ఆఫర్

డొమినోస్​ మస్తుమస్తు జాబ్​ ఆఫర్​ ఇచ్చింది. ఏంటో తెలుసా.. తినాలె, ఎట్లుందో చెప్పాలె. అంతే. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్​ డొమినోస్​ రీజనల్​ హెడ్​క్వార్టర్స్​లో డ్యూటీ. ఒక్కరోజు పని. అంటే ఏడున్నర గంటలు పనిజేయాలె. అందుకు గంటకు 30 ఆస్ట్రేలియన్​ డాలర్లు (20 అమెరికా డాలర్లతో సమానం. ₹1400) ఇస్తానంటోంది. అయ్యయ్యో ఆస్ట్రేలియాలోనా, అయితే, నాకు ఆఫర్​ రానట్టే అనుకోవద్దు. ప్రపంచంలో ఎవరైనా ఆ జాబ్​కు పోటీ పడొచ్చు. వచ్చే ₹10 వేలకు, వేలకు వేలు ఫ్లైట్​ టికెట్​ కోసం ఖర్చు చేసి వెళ్లాలా? అనుకోవద్దు. వేరే దేశాల్లో ఉంటున్నోళ్లకు రానోబోను ఫ్లైట్​ టికెట్​, అక్కడ ఉండేందుకు వసతి కంపెనీనే ఏర్పాటు చేస్తుందట. జాబ్​ వచ్చినోళ్లు చేయాల్సింది కేవలం, అక్కడ ఉండి గార్లిక్ బ్రెడ్ తిని, రుచి ఎట్ల ఉందో చెప్పడమే. ఒక్క రోజు కోసం ఇంత తతంగమా అనుకోవద్దు. దాని కోసం సవాలక్ష కండిషన్లు కూడా కంపెనీ పెట్టింది. గార్లిక్​ బ్రెడ్​ (వెల్లుల్లి, బ్రెడ్డు) తినడంలో ఐదేళ్ల అనుభవం ఉండాలి. పిజ్జా, గార్లిక్​ బ్రెడ్​ మధ్య రిలేషన్​షిప్​ ఏంటో తెలిసుండాలి. మంచి ఫుడీ అయి ఉండాలి. ఎవరో తెచ్చిచ్చేదాకా వేచి చూడకుండా గార్లిక్​ బ్రెడ్డు తయారు చేయడంలో ఒక్కసారైనా చేతులు కాల్చుకుని ఉండాలి. పక్కపొంటోళ్ల తిండి అలవాట్లను ఒక్కసారైనా రివ్యూ చేసి ఉండాలి.

డ్యూటీ: బ్రిస్బేన్​లోని డొమినోస్​ స్టోర్​లో చీఫ్​ గార్లిక్​ బ్రెడ్​ టేస్ట్​ టెస్టర్​.

ఎలా అప్లై చేయాలి?: మీకే ఎందుకు ఆ ఉద్యోగం ఇవ్వాలో  ఓ వీడియో తీయాలి. లేదంటే కంపెనీ పెట్టే సర్వేని పూర్తి చేసి 200 పదాల్లో మీ గురించి చెప్పాలి.

చివరి తేదీ: అక్టోబర్​ 7. అప్లై చేసేసుకోండి మరి.