మీరు నీళ్లు ఎలా తాగుతున్నారు.. అలా తాగితే మాత్రం డేంజరే..

మీరు నీళ్లు ఎలా తాగుతున్నారు.. అలా తాగితే మాత్రం డేంజరే..

మంచి నీళ్లు తాగటం హెల్త్‌‌కి మంచిది. కానీ నీళ్లని ఎలా తాగాలో తెలుసా?  మంచినీళ్లు ఎలా తాగాలో కూడా తెలీదా? మరీ ఓవర్‌‌‌‌ కాకపోతే  అనుకుంటున్నారా. కానీ, నిజానికి మనం తినే, తాగే ప్రతీదానికి ఒక పద్ధతి ఉందంటుంది ఆయుర్వేదం. రోజులో నాలుగు లీటర్లు తాగాలి అంటే ఒకేసారి రెండు లీటర్లు తాగితే కుదరదు. కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తాగాలి.

అందుకే మంచినీళ్లు ఎలా తాగాలో  చెబుతున్నారు ఆయుర్వేదిక్‌‌ ఎక్స్​పర్ట్ దీక్షా భావ్సర్​. ఆమె ఇన్‌‌స్టాగ్రామ్ పేజ్‌‌లో ఒక వీడియోలో మంచి నీళ్లని ఎలా తాగాలి? ఎంత తాగాలి? దానివల్ల ఏం జరుగుతుంది అని చెప్పారు.

ఉదయం లేవగానే వాటర్ తాగాలన్న రూల్ ఆయుర్వేదంలో లేదు. కానీ 7-నుంచి 8 గంటలు ఏమీ తినకుండా ఉన్నప్పుడు…  గోరు వెచ్చని నీళ్లు తాగటం హెల్త్‌‌కి చాలా మంచిది. ఎప్పుడు దాహమైతే అప్పుడే మంచినీళ్లు తాగాలి. అది కూడా కడుపు నిండి పోయేంత ఎక్కువగా కాదు.

ఈ బిజీ లైఫ్ లో భోజనం చేయటానికే టైం కుదరటం లేదు. కానీ ప్రశాంతంగా కూర్చునే తినాలి. అలాగే మంచి నీళ్లు తాగటం కూడా నిలబడి గటగటా తాగటం వల్ల కిడ్నీలకి మంచిది కాదు. ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది.

బాటిల్ లేదా గ్లాస్‌‌ని ఎత్తి స్పీడ్‌‌గా తాగకూడదు. దీనివల్ల టెన్షన్ పెరిగే అవకాశం ఉంది. బాగా చల్లగా ఉండే నీళ్లు మంచివి కానట్టే, వేడి నీళ్లు కూడా హెల్త్‌‌కి మంచి కాదు. రూమ్ టెంపరేచర్​లో ఉండే నీళ్లు లేదా గోరు వెచ్చగా ఉండే నీళ్లు తాగడం చాలా మంచిది. చిల్డ్ వాటర్ జోలికి వెళ్లకపోవటం చాలా బెటర్.

మంచినీళ్లు తాగటం అవసరమే కానీ అవసరానికి మించి వద్దు. నీళ్లు మరీ ఎక్కువగా తాగితే స్కిన్, ఇమ్యూనిటీ పవర్, డైజెషన్‌‌కి మంచిది అంటారు. కానీ అది పూర్తిగా కరెక్ట్ కాదు. మన బాడీకి ఎంత అవసరమో అంతే తీసుకోవాలి.

అవసరం అయినదానికంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే.. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. డైజేషన్‌‌కి కూడా మంచిది కాదు. దాహం వేసినప్పుడే తాగాలి.  అదికూడా అవసరమైనంత మాత్రమే తాగాలి తప్ప. ఎంత ఎక్కువ నీళ్లు తాగితే అంత మంచిది అనుకుని మరీ ఎక్కువగా మాత్రం తాగొద్దు.

For More News..

కరోనా తర్వాత కొత్త బిజినెస్‌లు పెరిగినయ్!

ఎడ్యుకేషన్ స్టార్టప్‌‌‌‌లకు దండిగా ఫండ్స్

యోగాకు అధికారిక గుర్తింపు