V6 News

విద్యకు ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి : పి.సుదర్శన్ రెడ్డి

విద్యకు ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి : పి.సుదర్శన్ రెడ్డి

బోధన్, వెలుగు: కాంగ్రెస్​ప్రభుత్వం విద్యకు అధిక ఫండ్స్​కేటాయిస్తూ పెద్దపీట వేస్తోందని ప్రభుత్వ సలహదారుడు పి.సుదర్శన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్​జిల్లా బోధన్​మండలంలోని బెల్లాల్ లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ భవన నిర్మాణ పనులను బుధవారం కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్​రెడ్డి మాట్లాడుతూ.. ఈ స్కూల్​లో కేజీ నుంచి 12 వరకు చదువుకునే అవకాశముందని తెలిపారు.

కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులందరికీ ఒకే సముదాయంలో అధునాతన సౌకర్యాలతో వసతిని కల్పిస్తూ, ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోందన్నారు. విద్యార్థులను కలిసేందుకు వచ్చే తల్లిదండ్రులకు ప్రత్యేక వసతి భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఉర్డూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, అడిషనల్ కలెక్టర్ దిలీప్ కుమార్, ఆర్డీవో రాజేందర్, మున్సిపల్ చైర్ పర్సన్​తూము పద్మ, సర్పంచ్ రాజు తదితరులు పాల్గొన్నారు.