బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

బిచ్చమడిగితే చిల్లరివ్వకుండా ఏకంగా జాబులే ఇప్పించిండు

500 మందికి పైగా బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌కి జాబులిప్పించిన తమిళనాడు యువకుడు

గుడికి పోయినప్పుడో,  సినిమా హాల్‌‌‌‌‌‌‌‌ నుంచి బయటకు వస్తున్నప్పుడో,  సిగ్నల్ దగ్గర ఆగినప్పుడో మనకు బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌ కనపడుతుంటరు. చేయి చాపి దానం చెయ్యమని అడుగుతుంటరు. జర సాఫ్ట్ హార్ట్ ఉన్నోళ్లు.. చిల్లర ఉంటే తీసిఇస్తరు.  వీలైతే  స్నాక్స్ కొనిస్తరు. వాటర్ బాటిల్ తెచ్చిస్తరు. తమిళనాడు పిలగాడు నవీన్ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి కూడా ఆరేళ్ల కింద ఇలాంటి అనుభవమే ఎదురైంది. కానీ,  అందరిలెక్క జేబుల ఉన్న చిల్లర తీసి వాళ్ల చేతిలో పెట్టలేదు.  ఆ బెగ్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ఉద్యోగం ఇప్పించి.. సెకండ్ లైఫ్‌‌‌‌‌‌‌‌ ఎట్లుంటదో  చూపించిండు. అక్కడితో ఆగలేదు.. ఇప్పటికే ఐదొందలమందికి పైగా బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌కి జాబులు ఇప్పించిండు. మరో ఐదువేల మంది బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌కి పునరావాసం కల్పించిండు.

అది 2014. నేను ఎరోడ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న గుడికి వెళ్లాను.  ఒకామె దానం చేయమని నన్ను అడిగింది. ఎందుకు అంటే, నా ఫ్యామిలీ నన్ను వదిలేసిపోయింది,  నేను  మా ఇంటికి వెళ్లడానికి డబ్బులు కావాలని చెప్పింది’ అని అన్నాడు నవీన్‌‌‌‌‌‌‌‌. అప్పుడు నవీన్ మెకానికల్ ఇంజినీరింగ్ థర్డ్‌‌‌‌‌‌‌‌ ఇయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చదువుతున్నాడు. ఆమెకు తన దగ్గరున్న పదిహేను రూపాయలు ఇచ్చేశాడు.  ఆ రోజు మొత్తం ఆమె గురించే ఆలోచిస్తూ నిద్రపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఇంకో వ్యక్తి కలిశాడు.  తన పేరు రాజశేఖర్,  ఫ్యామిలీ దగ్గరికి వెళ్లడానికి డబ్బులు కావాలని అడిగాడు. మళ్లీ ఇచ్చాడు నవీన్‌‌‌‌‌‌‌‌. నవీన్‌‌‌‌‌‌‌‌ది కూడా పేద కుటుంబమే, తను మాత్రం ఎంతమందికి సాయం చేయగలడు?  అయినా ఇలాంటి వాళ్లకోసం ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అయ్యాడు. కానీ, కొన్ని రోజుల తర్వాత తను డబ్బులు ఇచ్చిన రాజశేఖర్ ఇంకా అక్కడే ఉండటం చూసి నవీన్ షాక్ అయ్యాడు.

రియలైజ్ అయ్యిండు

‘‘ఓహో.. ఇతను అడుక్కుంటున్నాడు’’ అని రియలైజ్ అయ్యాడు నవీన్‌‌‌‌‌‌‌‌.  వెంటనే అతని దగ్గరికెళ్లి.. గౌరవంగా పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా? ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. అలా ఇరవై రెండు రోజులు రాజశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఫాలో అయ్యాడు. ప్రతి రోజు సాయంత్రం అతడి నుంచి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసేవాడు. ఎన్ని చేసినా.. అతడు నవీన్‌‌‌‌‌‌‌‌ని తిడుతూ తప్పించుకొని తిరిగేవాడు. “ఒక రోజు రాత్రి పదకొండు గంటలకు ఇద్దరం కలిసి టీ తాగాం. అప్పుడు చెప్పాడు తన సంగతి. తాను తాగుడుకు బానిసయ్యానని, ఏ పని చేయలేక ఈ దారిని ఎంచుకున్నానని చెప్పాడు” అని అతను నవీన్‌‌‌‌‌‌‌‌తో చెప్పాడు. ఇలాంటి వాళ్లకు ఎలా సాయం చేయాలి? అని ఆ రోజు నుంచి ఆలోచించడం మొదలుపెట్టాడు. వీళ్లకు ఎలాగైన ఒక ఉపాధి చూపించాలనుకున్నాడు.

డిస్కరేజ్ చేసిన్రు

ఇట్ల బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌కి జాబ్‌‌‌‌‌‌‌‌ ఇప్పిస్తే ఎలా ఉంటుంది? అని తన ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ని, కాలేజీలో టీచర్లని అడిగి చూశాడు. అందరూ అతడ్ని డిస్కరేజ్ చేశారు. ‘‘ ప్రభుత్వమే బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌ ఇష్యూస్‌‌‌‌‌‌‌‌ని సాల్వ్ చేయలేకపోయింది. నువ్వు ఒక్కడివి ఏం చేస్తావు? వాళ్లకు ఏం చేసినా మళ్లీ అడుక్కోవడం మొదలుపెడతారు’’ అన్నారు. కాలేజీ అయిపోయింది.   పీజీ కోర్సులో జాయిన్ అయ్యాడు. కానీ,  అతని మైండ్‌‌‌‌‌‌‌‌లో నుంచి రాజశేఖర్ మాత్రం పోవడం లేదు.  అప్పుడే ‘అచ్చయమ్‌‌‌‌‌‌‌‌’ ట్రస్ట్‌‌‌‌‌‌‌‌ పెట్టాడు. ట్రస్ట్ అయితే పెట్టాడు కానీ, ఫండ్స్‌‌‌‌‌‌‌‌ సమస్య వచ్చి పడింది. ‘‘నేను ఇంటి దగ్గర డబ్బులు అడగలేకపోయాను. ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ని, కాలేజీ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌ని అడగడం మొదలుపెట్టాను. కానీ, ‘నువ్వు కూడా బెగ్గర్స్​ పేరు చెప్పి అడుక్కుంటున్నావు’ అని డిస్కరేజ్ చేశారు నన్ను. నా పీజీ 2016లో కంప్లీట్ అయింది. ఒక కాలేజీలో లెక్చరర్ జాబ్ వచ్చింది. నాకు వచ్చే శాలరీ నుంచి కొంత డొనేట్ చేయడం మొదలుపెట్టా. పని మంచిదైతే.. పదిమంది కలుస్తారు అన్నట్టు.. నెమ్మదిగా నా టీమ్‌‌‌‌‌‌‌‌లో పద్దెనిమిది జిల్లాల నుంచి నాలుగు వందల మంది వలంటీర్లు చేరారు. వాళ్లంతా తమకు చేతనైనంత డొనేషన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు” అని తన ఎక్స్​పీరియెన్స్​ను చెప్పాడు నవీన్​.

వారం వారం తిరిగి

వారానికి ఒకసారి బస్టాండ్స్‌‌‌‌‌‌‌‌, గుళ్లు, రైల్వేస్టేషన్స్‌‌‌‌‌‌‌‌ లాంటి పబ్లిక్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లకి పోతారు వలంటీర్లు.  అక్కడ ఉన్న బెగ్గర్స్‌‌‌‌‌‌‌‌ వివరాలు అన్ని సేకరిస్తారు. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌  తీసుకునేవాళ్లు, తాగుడుకు బానిస అయినవాళ్లు, ఫ్యామిలీ వదిలేసినవాళ్లు ఇలా పందొమ్మిది కేటగిరీలు ఉంటాయి.  అలా విభజించి ఎవరిని ఎక్కడికి పంపాలో అక్కడికి పంపిస్తారు. వాళ్లలో కొంచెం స్కిల్స్ ఉన్నవాళ్లకు ఫుడ్‌‌‌‌‌‌‌‌ స్టాల్స్ పెట్టించారు. టైలరింగ్‌‌‌‌‌‌‌‌, వాచ్‌‌‌‌‌‌‌‌మెన్‌‌‌‌‌‌‌‌, పెయింటర్స్‌‌‌‌‌‌‌‌, రెస్టారెంట్స్‌‌‌‌‌‌‌‌లో  సర్వర్స్‌‌‌‌‌‌‌‌, కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ వర్కర్స్‌‌‌‌‌‌‌‌, పండ్ల బండ్లు ఇలా రకరకాల పనుల్లో వాళ్లకు ఉపాధి కల్పించాడు నవీన్‌‌‌‌‌‌‌‌.  ఇంకొంతమందికి కౌన్సెలింగ్ ఇప్పించి మళ్లీ వాళ్ల ఫ్యామిలీతో కలిపాడు. ఈ కౌన్సెలింగ్ కూడా వలంటీర్లలో ఉన్న సైకాలజీ స్టూడెంట్సే చేస్తారు. ఇక, ఏ పని చేయలేని స్థితిలో ఉన్నవాళ్లను ఆశ్రమాలకు పంపిస్తున్నారు. ఈ యంగ్‌‌‌‌‌‌‌‌స్టర్స్ చేస్తున్న పనికి గుర్తింపుగా సెంట్రల్ గవర్నమెంట్‌‌‌‌‌‌‌‌ రెండేళ్ల కింద ‘నేషనల్‌‌‌‌‌‌‌‌ యూత్‌‌‌‌‌‌‌‌ అవార్డ్‌‌‌‌‌‌‌‌’ కూడా ఇచ్చింది.

నవీన్ సాయం వల్లే

‘నేను తాగుడుకు బానిసనయ్యాను. పదేళ్ల కింద జాబ్‌‌‌‌‌‌‌‌ పోయింది. ఫ్యామిలీకి దూరమయ్యాను. లాక్‌‌‌‌‌‌‌‌డౌన్ టైమ్‌‌‌‌‌‌‌‌లో నాకు నవీన్ హెల్ప్ చేశాడు. మంచి ఫుడ్‌‌‌‌‌‌‌‌ పెట్టి, బట్టలు ఇచ్చాడు. కౌన్సెలింగ్ ఇప్పించడంతో నెమ్మదిగా వ్యసనం నుంచి బయటపడ్డాను. నా హెల్త్ ఇంప్రూవ్ అయింది. నా ఫ్యామిలీతో కలిపించి, టీ స్టాల్ పెట్టించాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాను’ అని వెంకట్రామన్ అనే వ్యక్తి చెప్పాడు.

For More News..

సినిమాల్లోనే విలన్.. రియల్ లైఫ్‌లో మాస్ హీరో

రైతుల పక్షాన నిలవడ్డదని జాబ్​ తీసేసిన్రు

మొదలైన వింటర్ క్రైసిస్.. పెరుగుతున్న కరోనా కేసులు

జీహెచ్ఎంసీలో టికెట్ల లొల్లి షురూ