మియాపూర్ లో విషాదం.. బట్టలు ఆరేస్తుండగా.. కరెంట్ షాక్ తో యువకుడి మృతి

మియాపూర్ లో విషాదం.. బట్టలు ఆరేస్తుండగా.. కరెంట్ షాక్ తో యువకుడి మృతి

హైదరాబాద్: మియాపూర్ పోలీస్ స్టేషన్​ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. బట్టలు ఉతికి ఆరేస్తుండగా కరెంట్ షాక్​ తో యువకుడు మృతిచెందాడు. కరెంట్ వైర్లను నిర్లక్ష్యంగా వదిలివేయడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. 

గురువారం(అక్టోబర్​23) మియాపూర్​ పరిధిలోని అల్విన్​ కాలనీలో మహేందర్​ అనే యువకుడు విద్యుత్​ షాక్​ తో మృతిచెందాడు. తను ఉంటున్న బిల్డింగ్​ బాల్కనీలో బట్టలు ఆరేస్తుండగా విద్యుత్​ వైర్లు తగిలి మహేందర్​ కు షాక్​ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు.  కేసు నమోదు చేసుకున్న  మియాపూర్​ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ALSO READ : సీనియర్ ఐఏఎస్ రిజ్వీ వీఆర్ఎస్ ఆమోదం..