
మహిళను బెదిరించి డబ్బులు చోరీ చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు కరీంనగర్ పోలీసులు. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై దాడి చేసి బెదిరించి నగదు చోరీ చేశాడు గుర్తు తెలియని వ్యక్తి..బాధితురాలు కేకలు వేయడంతో చుట్టుపక్కల పొలాల్లో పనిచేస్తున్న వారు వచ్చి దొంగను పట్టుకునే ప్రయత్నంచేశారు. దొంగ తప్పించుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. కొత్తపల్లి మండలం చింతకుంటకు చెందిన మాంకాళి మీనా(37) అదే మండలంలోని కొండాపూర్ లోని బంధువుల ఇంట్లో ఫంక్షన్ వెళ్లి వస్తుండగా.. ఓవ్యక్తి చంపుతానని బెదిరించి ఆమె దగ్గర ఉన్న రూ. 4వేల నగదు లాక్కున్నాడు. బాధితురాలు మీనా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు అక్కడికి చేరుకొని ఆమెను రక్షించారు. వారిని దొంగ అక్కడినుంచి పారిపోయాడు. మీనా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎక్స్ టార్షన్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు కొత్తపల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు.
ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి, కొత్తపల్లి ఎస్సై సాంబమూర్తి స్పందించారు. చోరీకి పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. నిందితుడిని పట్టుకొని త్వరలో కోర్టులో హాజరుపరుస్తామన్నారు.