
పెబ్బేరు, వెలుగు : ఇటీవల విడుదలైన గ్రూప్-–2 ఫలితాల్లో పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలోని చెల్లిమిళ్ల గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన సోని ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది. వివరాల్లోకి వెళ్తే.. చెలమిళ్ల గ్రామానికి చెందిన ఏ.రాముడు, సువర్ణ దంపతులకు ముగ్గురు సంతానం. అందులో సోని అనే అమ్మాయి చిన్నది. ఈ అమ్మాయి పీజీ పూర్తి చేసింది.
గ్రూప్స్ కోసం ప్రిపేరై పరీక్షలు రాయడంతో ప్రభుత్వం ఉద్యోగం ఆమెను వరించింది. ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్(గ్రేడ్-–1 సూపర్వైజర్)గా ఆమె ఎంపికైంది. ఈ సందర్భంగా సోనికి బంధుమిత్రులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
ఎక్సైజ్ఎస్సైగా వికాస్ ఎంపిక
కల్వకుర్తి: మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన దేవరకొండ శ్రీనివాస్, పద్మావతి దంపతుల కుమారుడు వికాస్ గ్రూప్ –2లో ఎక్సైజ్ ఎస్సైగా సెలక్ట్ అయ్యాడు. వికాస్ ప్రస్తుతం వెల్డండ మండలం గోకారం, బైరాపూర్ గ్రామ పంచాయతీలకు కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. ఎక్సైజ్ఎస్సైగా వికాస్ ఎంపిక కావడంతో బంధుమిత్రులు అభినందనలు తెలిపారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా విజయ
వెల్డండ మండలం అల్లంతోట గ్రామ పరిధిలోని బావితండాకు చెందిన రాట్లావత్ విజయ గ్రూప్ –2 లో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్గా ఎంపికయ్యారు. విజయ భర్త ఇస్లావత్ హనుమంత్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. గ్రూప్–2లో ఉద్యోగం సాధించిన విజయకు పలువురు అభినందనలు తెలిపారు.