మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై యువకుల దాడి

మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులపై యువకుల దాడి

మద్యం మత్తులో ఓ యువకుడు పోలీసులపై దాడి చేశాడు.  ఈ ఘటన జగిత్యాల జిల్లాలో  మార్చి 14న రాత్రి జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా జగిత్యాల ట్రాఫిక్  ఎస్ఐ రామ్ గొల్లపల్లి రోడ్ లో  తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బైక్ పై వచ్చిన ఇద్దరు యువకులు మహేశ్, మహేందర్ లను  పోలీసులు బ్రీత్ ఎనలైజర్ తో టెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా  ఒప్పుకోలేదు.  పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  

టెస్ట్ చేయడానికి మీరెవరంటూ పోలీసులను అసభ్య పదజాలంలో దూషించారు. ఎదురు తిరిగిన హోంగార్డ్ ను చెంపై కొట్టారు.   హోంగార్డ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు  కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.  అయితే పోలీసులపై దాడి చేసిన ఓ యువకుడు అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ బంధువని తెలుస్తోంది.