పాతబస్తీలో యువకుల ఆటో రేసింగ్

పాతబస్తీలో యువకుల ఆటో రేసింగ్

హైదరాబాద్ లోని పాతబస్తీలో కొంత మంది ఆకతాయిలు ఇష్టానుసారం రెచ్చిపోతున్నారు. రోడ్లపై ఆటోలతో రేసులు చేస్తూ ఇతర వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పాత బస్తీలోని కొంత మంది యువకులు చేస్తున్న ఈ పనులపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సాగర్ మెయిన్ రోడ్డు, ఓవైసీ జంక్షన్, సంతోష్ నగర్, చాంద్రాయణగుట్ట మెయిన్ రోడ్లపై నైట్ టైంలో కొంత మంది యువకులు ఆటో రేసింగ్ నిర్వహిస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులు అటు వైపు వెళ్లేందుకే భయపడుతున్నారు. అత్యంత వేగంగా రోడ్ల పై రేస్ లు నిర్వహిస్తుండటంతో ఏ క్షణంలో ఎటునుంచి వచ్చి ఢీకొడతారోనని ఆందోళన చెందుతున్నారు. ఆటో రేసింగ్ చేస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

మరిన్ని వార్తల కోసం..

బంకర్‎లో భయంభయంగా తెలుగు విద్యార్థులు

‘భీమ్లా నాయక్’పై ఆర్జీవీ, నారా లోకేశ్ ట్వీట్లు

ఒకవైపు యుద్ధం.. మరోవైపు షూటింగ్