ఆసిఫాబాద్ జిల్లాలో ప్రేమకు అడ్డుపడుతున్నారని టవరెక్కిన యువకుడు

  ఆసిఫాబాద్ జిల్లాలో ప్రేమకు అడ్డుపడుతున్నారని టవరెక్కిన యువకుడు
  •     ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలో ఘటన

కాగ జ్ నగర్, వెలుగు :  యువతి తల్లిదండ్రులు తమ ప్రేమకు అడ్డుపడుతున్నారని ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్ చల్ చేశాడు. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మద్దిగూడ గ్రామానికి చెందిన కోరితే కృష్టయ్య అదే మండలంలోని సలుగుపల్లి గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకుంటున్నారు. ఇది తెలిసిన యువతి తల్లిదండ్రులు అడ్డుపడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన అతడు శుక్రవారం సలుగుపల్లికి వెళ్లి లో  సెల్ టవర్ టవర్ ఎక్కి గంటసేపు హల్ చల్ చేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ ఐ సర్ఫరాజ్ పాషా అక్కడికి వెళ్లి యువకుడికి నచ్చజెప్పి టవర్ పై నుంచి నుంచి కిందికి దింపారు. కృష్టయ్యను అదుపులో తీసుకొని కౌన్సెలింగ్ చేశారు.