
కూకట్పల్లి, వెలుగు: పోక్సో కేసులో ఓ యువకుడికి 20 సంవత్సరాల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కూకట్పల్లి ఫాస్ట్ట్రాక్కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. బాలానగర్ఇన్స్పెక్టర్ నరసింహరాజు తెలిపిన వివరాల ప్రకారం.. బాలానగర్ఫిరోజ్గూడకు చెందిన బక్రత్అలీ(21) 2022లో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదుతో బాలానగర్ పోలీసులు పోక్సో యాక్ట్కింద కేసు నమోదు చేశారు. విచారణ అనంతరం పోలీసులు ఆధారాలతో చార్జ్షీట్దాఖలు చేశారు. కూకట్పల్లి ఫాస్ట్ట్రాక్కోర్టు స్పెషల్జడ్జి జె.విక్రమ్శనివారం తీర్పు ఇచ్చారు. బక్రత్అలీకి 20 ఏండ్లు జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించారు.