యూట్యూబ్ కొత్త పాలసీ : ఆ వీడియో కంటెంట్ క్రియేటర్స్ కు చెక్

యూట్యూబ్ కొత్త పాలసీ : ఆ వీడియో కంటెంట్ క్రియేటర్స్ కు చెక్

ప్రముఖ వీడియో ఫ్లాట్ ఫాం యూట్యూబ్ ఫేక్ వీడియో క్రియేటర్స్ కు చెక్ పెట్టేందుకు తన కంటెంట్ పాలసీలను ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటుంది. తాజాగా ఓ కొత్త పాలసీని అందుబాటులోకి తెచ్చింది.

కొంతమంది  వీడియో క్రియేటర్స్ ఎన్నికలు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి  ఫేక్ ఇన్ఫర్మేషన్ సర్క్యూలేట్ చేస్తుంటారు.

ఫేక్ వార్తల్ని సర్య్కూలేట్ చేస్తున్న యూట్యూబర్స్ కు చెక్ పెట్టేలా కొత్త నిబంధనల్ని అమలు చేసింది.   ఎన్నికలకు సంబంధించి తప్పుడు సమాచారం పోస్ట్‌ చేయడాన్ని యూట్యూబ్ లో  నిషేధించనున్నట్లు గూగుల్‌ సంస్థ ప్రతినిధులు ..ప్రభుత్వ ఉద్యోగులు మరణించారనిగానీ, ఎన్నికల తేదీ వ్యవహారంలో తప్పుడు సమాచారంగానీ యూట్యూబ్‌లో పోస్ట్‌ చేస్తే దాన్ని తొలగిస్తామని ఆ సంస్థ చెప్పింది.

తాము నియమించిన ట్రస్ట్‌ అండ్‌ సేఫ్టీ టీమ్‌లు ఆయా వీడియోలను నిరంతరం పరిశీలిస్తుంటాయని చెప్పింది. వార్తలకు నమ్మదగిన స్థానం కలిగిన దానిగా యూట్యూబ్‌ను మార్చనున్నట్లు తెలిపింది.

ఇప్పటికే ఫేస్ బుక్ సైతం ఆర్టీఫీయల్ ఇంటెలిజన్స్ ద్వారా వీక్షకులను తప్పుదారి పట్టించే వీడియోలను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలను నిషేధిస్తున్నామని ట్విటర్‌ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.