బ్యాక్​ గ్రౌండ్కి నచ్చిన వీడియో

బ్యాక్​ గ్రౌండ్కి నచ్చిన వీడియో

కంటెంట్ క్రియేటర్స్ చిన్న వీడియోల్ని షేర్ చేసుకునేందుకు యూట్యూబ్ షార్ట్స్ యాప్ ఉపయోగిస్తుంటారు.  వీళ్లకోసం ఈమధ్యే ‘గ్రీన్​ స్క్రీన్​’ అనే ఫీచర్ తెచ్చింది యూట్యూబ్. ఈ ఫీచర్ సాయంతో నిమిషం నిడివి ఉన్న  యూట్యూబ్ వీడియోలు, షార్ట్స్​ని తమ ఒరిజనల్ షార్ట్​ వీడియోకి బ్యాక్​గ్రౌండ్​గా పెట్టుకోవచ్చు. యూజర్లు వీడియోతో పాటు ఆడియో లేదా వీడియో మాత్రమే చేయొచ్చు కూడా.

ఇప్పటికైతే ఈ ఫీచర్ ఐఒఎస్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది త్వరలోనే ఆండ్రాయిడ్ యూజర్లకు రానుంది. గ్రీన్​ స్క్రీన్ ఫీచర్​ కోసం... యూట్యూబ్ షాట్స్​ యాప్​లో ​ వీడియో ఓపెన్ చేసి ‘క్రియేట్’ ఐకాన్ మీద నొక్కాలి.  ‘గ్రీన్ స్క్రీన్’ ఆప్షన్ సెలక్ట్ చేసి, ఒరిజినల్ వీడియోని రికార్డ్ చేయాలి.  గ్రీన్​ స్క్రీన్ ఫీచర్​ ఏం చేస్తుందంటే... స్మార్ట్​ఫోన్​లోని ఇమేజ్ ప్రాసెసింగ్ క్యాపబిలిటీని వాడుకుని వీడియో బ్యాక్​గ్రౌండ్​ని మార్చేసి, ఆ ప్లేస్​లో సెలక్ట్ చేసుకున్న వీడియోని పెడుతుంది. దాంతో, కంటెంట్ క్రియే టర్స్ ఎక్కడ వీడియో చేసినా నచ్చిన పాట లొకేషన్​ని బ్యాక్​గ్రౌండ్​లో సెట్​ చేసుకొనే వీలుంటుంది. 

ఆన్​లైన్ పేమెంట్ యాప్స్​ వచ్చాక  జేబులో పర్స్ లేకున్నా నడిచిపోతోంది. వీటికి తోడు ఐ ఫోన్ యూజర్లకు యాపిల్ వ్యాలెట్ యాప్, సామ్​సాంగ్ పే వంటి యాప్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం  గూగుల్ త్వరలోనే ఒక కొత్త వ్యాలెట్ యాప్ తీసుకురాబోతోంది. పేరు గూగుల్​ వ్యాలెట్ యాప్. నలభై దేశాల్లోని యూజర్లకు ఈ యాప్​ అందుబాటులోకి రానుంది.

ఇదొక వర్చువల్ వ్యాలెట్.  ఇందులో డబ్బులు వేసి, అవసరమైనప్పుడు ఖర్చు చేయొచ్చు. అంతేకాదు బ్యాంక్ కార్డు వివరాల్ని ఈ వ్యాలెట్​లో స్టోర్ చేసుకోవచ్చు.  ఫ్లయిట్ టికెట్స్ ఇందులో పెడితే, ఫ్లయిట్ ఆలస్యమైనప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ యాప్​లో స్టూడెంట్స్ ఐడీ కార్డ్స్, వ్యాక్సిన్​ సర్టిఫికెట్, ఈవెంట్స్​కి సంబంధించిన టికెట్స్​ని స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు.