చంద్రబాబు అనుభవం ఎందుకు పనికొస్తుంది: అసెంబ్లీలో సీఎం జగన్​ 

చంద్రబాబు అనుభవం ఎందుకు పనికొస్తుంది: అసెంబ్లీలో సీఎం జగన్​ 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అసెంబ్లీ సాక్షిగా ప్రత్యేక హోదాపై మరోసారి స్పందించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడితే 14 ఏళ్లు సీఎం అంటారు.. ఆ అనుభవం ఎందుకు పనికొస్తుంది..అనుభవం లేకపోయినా అందరూ ఆశ్చర్యపోయే పాలన అందిస్తున్నామంటూ జగన్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ...  విభజన చట్టంలో కనీసం హోదా అంశాన్ని రాసి ఉంటే బాగుండేది.... కోర్టుకు వెళ్లయినా సరే సాధించుకునే వీలు ఉండేది.. ఇప్పుడు, కేంద్రం ఇస్తే తప్ప మాట్లాడలేని పరిస్థితి నెలకొందని.. అందుకే కేంద్రంలో ఏపార్టీకీ పూర్తి మెజార్టీ రాకూడదని కోరుకుంటున్నామని జగన్ పేర్కొన్నారు. అప్పుడైనా సరే నిధులు, హోదాపై మాట్లాడే వీలుంటుందన్నారు. 

రాష్ట్ర ప్రజలకు వినమ్రంగా తెలియజేసేది ఏమిటంటే..బాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియమిస్తానన్న పులిని నమ్మడమేన్నారు సీఎం జగన్​. వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదు..అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదన్నారు. చంద్రబాబు మనసు లేని మోసం చేసే నాయకుడున్నారు.  ఆయన కేవలం వాగ్ధానాలు మాత్రమే చేస్తారు.. కాని అమలు పరచరంటూ ...అలివి కానీ హామీలిచ్చి వాటి అమల్లో దారుణంగా విఫలమైనందుకు, అన్ని వర్గాల వారిని మోసం చేసినందుకు 2019లో 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే బాబుకు దక్కాయన్నారు. మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు 151 స్థానాలు కట్టబెట్టారు... ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు. విశ్వసనీయతకు అర్థం జగనేని.. విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుందన్నారు.