స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే : వైఎస్ జగన్

స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే : వైఎస్ జగన్

నిడదవోలు సభలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. స్కిల్ స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అన్నారు. లేని కంపెనీని ఉన్నట్టుగా ఫేక్ అగ్రిమెంట్ సృష్టించారని ఆరోపించారు. చంద్రబాబును కోర్టు రిమాండ్ కు పంపితే ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడు అని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. అవినీతి కేసులో ఆధారాలతో సహా చంద్రబాబు అరెస్ట్ అయ్యారని, అక్రమాలు చేసిన వ్యక్తిని రక్షించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చట్టం ఎవరికైనా ఒక్కటే అన్నారు. ఎల్లో మీడియా ఈ నిజాలు చూపించదు.. వినిపించదన్నారు. రూ.371 కోట్ల ప్రజాధనం ఎక్కడికి పోయింది అని ప్రశ్నించారు. 

ALSO READ: చంద్రబాబును సమర్థించే వాళ్లు ఈ 12 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి: వర్మ

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు గతంలో అడియో, వీడియో టేపులతో అడ్డంగా దొరికాడని వైఎస్ జగన్ ఆరోపించారు. అడియో, వీడియో టేపుల్లో బ్లాక్ మనీ పంచుతూ అడ్డంగా దొరికారన్నారు. చంద్రబాబు వాయిసే అని ఫోరెన్సిక్ వాళ్లు తేల్చినా... తనది వాయిస్ కాదని చంద్రబాబు వాదించాడని చెప్పారు. 45 ఏళ్లుగా దోపిడీని చంద్రబాబు రాజకీయంగా మార్చుకున్నారని చెప్పారు వైఎస్ జగన్. ఎల్లో మీడియా చంద్రబాబు అవినీతిపై మాట్లాడదన్నారు. సాక్ష్యాధారాలతో సహా దొరికినా బుకాయిస్తున్నారని ఆరోపించారు. బాబు దొంగతనాల్లో వీరంతా వాటాదారులే అని చెప్పారు. 

ములాఖత్ లో మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడు అని కామెంట్స్ చేశారు. ఎవరి జేబుల్లోకి రూ. 371 కోట్ల సొమ్ము పోయిందని ప్రశ్నించారు. కురుక్షుత్ర యుద్ధంలో న్యాయం తన వైపు ఉందన్నారు. వైఎస్ఆర్ సీపీ హయంలో మంచి జరిగిందా... లేదా అని చూడాలని ప్రజలను కోరారు. మంచి జరిగితే తనకు అండగా నిలబడాలని కోరారు. ప్రజలందరి ఆశీస్సులతో రానున్న రోజుల్లోనూ మంచి పాలన అందిస్తామన్నారు.