బీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలి : షర్మిల

 బీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలి : షర్మిల

తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కేసీఆర్ రాష్ట్రానికి ఏమైనా చేశారా అని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని  బీఆర్ఎస్ పాలనకు అంతం పలకాలని ప్రజలను కోరారు.  షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఇవాళ్టి నుంచి పునఃప్రారంభం అయింది. లింగగిరి ఎక్స్ రోడ్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పించారు.  

ఈ ఏడాది రాష్ట్రానికి ఎన్నికలు జరగనున్నాయని, మళ్లీ ఓట్ల కోసం కేసీఆర్ వస్తారని షర్మిల అన్నారు. కేసీఆర్ మాటలు విని మోసపోవద్దన్నారు. డబ్బులిస్తే  తీసుకోవాలని కానీ ఓటు మాత్రం మీ కోసం పాటు పడే పార్టీకే వేయలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలు అమలు చేయడమే తన  ధ్యేయమని ఈ సందర్భంగా షర్మిల వెల్లడించారు.