
హైదరాబాద్: పాల్వంచ రామకృష్ణ ఆత్మహత్య కేసులో... వనమా రాఘవను అరెస్ట్ చేయాలంటూ విపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ విషయంపై వైఎస్సార్ టీపీ స్పందించింది. వనమా లాంటి నీచుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ చేసిన ట్వీట్ ను వైఎస్ షర్మిల రీట్వీట్ చేశారు. ‘ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలి. టీఆర్ఎస్ లీడర్ అరాచకాలకు నిండు కుటుంబం బలైంది. ఎన్నో కలలు గన్న తల్లిదండ్రులు లోకాన్ని విడిచారు. బంగారు భవిష్యత్తు ఉన్న పసి పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. ఇలాంటి దుర్మార్గున్ని వదలిపెట్టొద్దదు. తన తండ్రి ఎమ్మెల్యే వనమా ప్రోద్బలంతోనే రాఘవ ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడు’ అని వైఎస్సార్ టీపీ ట్వీట్ చేసింది.
టీఆర్ఎస్ లీడర్ అరాచకాలకు నిండు కుటుంబం బలైంది. ఎన్నో కలలు గన్న తల్లిదండ్రులు లోకాన్ని విడిచారు. బంగారు భవిష్యత్తు ఉన్న పసి పిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. ఇలాంటి దుర్మార్గున్ని వదిలిపెట్టకూడదు. తన తండ్రి ఎమ్మెల్యే వనమా ప్రోద్బలంతోనే ఇలాంటి దారుణాలకు ఒడిగట్టాడు.1/2
— YSR TELANGANA PARTY (@YSRTelangana) January 7, 2022
‘గతంలో వనమా రాఘవ ఆగడాలకు ఓ వడ్డీ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి భూకబ్జాలు, సెటిల్ మెంట్లతో ఎన్నో కుటుంబాలు బలయ్యాయి. ఇలాంటి నీచుడికి వెంటనే ఉరి శిక్ష వేయాలి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకోవాలి’ అని వైఎస్సార్ టీపీ డిమాండ్ చేసింది. ఈ ట్వీట్ కు జస్టిస్ ఫర్ రామకృష్ణ ఫ్యామిలీ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేసి షర్మిల రీట్వీట్ చేశారు.
మరిన్ని వార్తల కోసం: