మహిళలకు గుడ్ న్యూస్ : అకౌంట్లలో డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18750

మహిళలకు గుడ్ న్యూస్ : అకౌంట్లలో డబ్బులు.. ఒక్కొక్కరికి రూ.18750

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రవేశపెట్టిన ' వైఎస్సార్ చేయూత ' నాలుగవ విడత నిధులను విడుదల చేయనుంది. అనకాపల్లిలో జరుగుతున్న సభలో సీఎం జగన్ బటన్ నొక్కి నిధులను మహిళల అకౌంట్లలో జమ చేయనున్నారు. ఈ పథకం కింద ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45ఏళ్ళ నుండి 60ఏళ్ళ లోపు మహిళలకు ప్రభుత్వం ఏటా 18,750రూపాయలను మంజూరు చేస్తోంది. ఈ పథకం కింద రాష్ట్రంలో 31 లక్షల 23వేల 466మంది మహిళలు లబ్ది పొందుతున్నారు.

వైఎస్సార్ చేయూత పథకానికి అర్హులు కావాలంటే, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే 10వేల లోపు ఆదాయం ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో అయితే 12వేల లోపు ఆదాయం ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల మాగాణి, 10ఎకరాల మెట్ట, లేదా మెట్ట, మాగాణి కలిపి 10ఎకరాల లోపు ఉండాలి. అంతే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం నుండి పింఛన్ తీసుకుంటున్న వారు అర్హులు కాదు. కరెంట్ వినియోగం 300 యూనిట్ల లోపు ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో 750చదరపు గజాల లోపు స్థలం ఉండాలి. ఆదాయ పన్ను చెల్లించే వారు, ఫోర్ వీలర్ ఉన్నవారు ఈ పథకానికి అర్హులు. పై అర్హతలు అన్నీ ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 45ఏళ్ళ నుండి 60ఏళ్ళ లోపు వయసు ఉన్న మహిళలకు అకౌంట్లలో 18,750 రూపాయలు జమ కానున్నాయి.