చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కేశినేని నాని

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కేశినేని నాని

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్ సీపీ నేత కేశినేని నాని తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు టికెట్లు అమ్ముకుని తెలంగాణ వెళ్లిపోతారని ఆరోపించారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరివన్నారు. జగన్ ను చూసి చంద్రబాబు సిగ్గు తెచ్చుకోవాలని సూచించారు.

కేశినేని నాని వ్యాఖ్యలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న కౌంటర్ వేశారు. కేశినేని నానిని పార్టీలోంచి గెంటేశారని..అందుకే దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుపై విమర్శలు చేస్తే కేశినేని నాని భవన్ కు వచ్చి తంతా అని వ్యాఖ్యానించారు. కేశినేనికి చెందిన ఓ హోటల్ లో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కేశినేని హోటల్ కు సంబంధించిన వ్యవహారమంతా త్వరలోనే బయటపెడతానని అన్నారు.