వైసీపీకి షాక్ - టీడీపీలో చేరిన కీలక నేత

వైసీపీకి షాక్  - టీడీపీలో చేరిన కీలక నేత

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల జాబితా ప్రకటించిన నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రచారం మొదలు పెట్టగా, సీటు ఆశించి భంగపడ్డ నేతలు పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో అధికార పార్టీ వైసీపీకి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీకి రాజీనామా చేయగా, తాజాగా పుంగనూరుకు చెందిన మరో కీలక నేత పార్టీని వీడి టీడీపీలో చేరాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాఖా అయిన పుంగనూరుకు చెందిన వైసీపీ నేత వెంకటరమణ రాజు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరాడు.

వైసీపీని వీడి టీడీపీలో చేరిన వెంకటరమణ రాజు పుంగనూరు టీడీపీ అభ్యర్థి చల్లా బాబు గెలుపు కోసం పని చేస్తానని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చాడు. కుప్పంలో పర్యటిస్తున్న ఆయన కార్యకర్తలకు ఈ మేరకు సూచన ఇచ్చారు. ఈ నెల 27న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్న బాబు 31వ తేదీ వరకు వరుస సభలతో బిజీగా గడపనున్నారు.