కేసీఆర్ హయాంలో  హ్యాకింగ్, సెల్లింగ్, కాపీయింగ్: షర్మిల   

కేసీఆర్ హయాంలో  హ్యాకింగ్, సెల్లింగ్, కాపీయింగ్: షర్మిల   

హైదరాబాద్, వెలుగు: తొమ్మిదేండ్లుగా కేసీఆర్ పాలనలో టీఎస్​పీఎస్సీ బోర్డులో సర్వర్లు హ్యాకింగ్, క్వశ్చన్ పేపర్స్ సెల్లింగ్.. హైటెక్ మాస్ కాపీయింగ్ జరిగిందని వైఎస్సార్​టీపీ చీఫ్ షర్మిల ఆరోపించారు. ఎగ్జామ్ హాల్​లోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్స్, ఇయర్ బడ్స్ తీసుకెళ్తుంటే సెంటర్ల వద్ద పోలీసులు ఏం చేస్తున్నట్టు అని మంగళవారం ట్వీట్టర్​లో షర్మిల ప్రశ్నించారు. 24 గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే ఇది సాధ్యమైందా? అని ఆమె మండిపడ్డారు. చాట్ జీపీటీతో బయటి నుంచి దర్జాగా సమాధానాలు పంపుతుంటే కేసీఆర్, టీఎస్​పీఎస్సీ బోర్డు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. టీఎస్​పీఎస్సీ ఐటీ డిపార్ట్ మెంట్ మొత్తం అవినీతిపాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ అసమర్థ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలన్నారు. దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారని ఆమె మండిపడ్డారు. నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా రాష్ట్రపతి అధికారాలను ఉపయోగించి ప్రస్తుత టీఎస్​పీఎస్సీ బోర్డును రద్దు చేయాల్సిందిగా సిఫార్సు చేయాలని గవర్నర్ తమిళిసైకి విజ్ఞప్తి చేశారు.