బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్కు అమ్ముడుపోయినై : షర్మిల

 బీజేపీ, కాంగ్రెస్ కేసీఆర్కు అమ్ముడుపోయినై : షర్మిల

కేసీఆర్కు బీజేపీ, కాంగ్రెస్లు అమ్ముడుపోయాయని వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. కేసీఆర్ అవినీతిని ప్రశ్నించేందుకు పార్టీ పెట్టినట్లు చెప్పారు. ములుగు జిల్లాలో షర్మిల పాదయాత్ర కొనసాగుతోంది. మల్లంపల్లి గ్రామాన్ని మండలం చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ 8 ఏళ్లైనా నెరవేర్చలేదని మండిపడ్డారు. మల్లంపల్లిని ఎందుకు మండలంగా చేయలేదని ఆమె ప్రశ్నించారు.  

కేసీఆర్కు పరిపాలన చేతకాదని.. ఎన్నికలు ఉన్నప్పుడే బయటకు వస్తారని షర్మిల విమర్శించారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షం బతికుంటే కేసీఆర్ ఆగడాలు సాగేవి కావన్నారు. కాళేశ్వరం పేరుతో 70 వేల కోట్ల అవినీతి చేసినా విపక్షాలు ప్రశ్నించలేదని ఆరోపించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని చెప్పారు.