కేసీఆర్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలి

కేసీఆర్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలి

హైదరాబాద్: రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ మరోమారు మండిపడింది. ప్రపంచంలోనే  మనది గొప్ప రాజ్యాంగమని ఆ పార్టీ పేర్కొంది. అలాంటి గొప్ప రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్న కేసీఆర్ కు ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఓ ట్వీట్ లో స్పష్టం చేసింది. ‘నా జాతి ప్రజలకు కత్తి చేతికివ్వలేదు. ఓటు హక్కును వజ్రాయుధంగా ఇచ్చాను. పోరాడి రాజులవుతారో, అమ్ముకుని బానిసలవుతారో మీ ఇష్టం’ అనే అంబేడ్కర్ కొటేషన్ ను ఈ ట్వీట్ కు  వైఎస్సార్ టీపీ జత చేసింది. 

మరిన్ని వార్తల కోసం: 

వాళ్లిద్దరూ రంజీల్లో ఆడాలె

‘గేట్’ను వాయిదా వేయడం కుదరదు

ఎడ్లబండిపై గురువు.. బండిలాగిన విద్యార్థులు