Yusuf Pathan: రాజకీయం వంటబట్టింది.. పేదల పెన్నిదిగా యూసుఫ్ పఠాన్ తొలి వాగ్దానం

Yusuf Pathan: రాజకీయం వంటబట్టింది.. పేదల పెన్నిదిగా యూసుఫ్ పఠాన్ తొలి వాగ్దానం

2024 లోక్‌సభ ఎన్నికల్లో భారత మాజీ క్రికెటర్, ఇర్ఫాన్ పఠాన్ సోదరుడు యూసుఫ్ పఠాన్ రాజకీయ అరంగ్రేటం చేయనున్నారు. తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీ తరుపున అతడు బహరంపూర్ పార్లమెంట్ స్థానం ఎంపీగా పోటీ చేయనున్నారు. అతని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ టీఎంసీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ ఆదివారం(మార్చి 10) ప్రకటన చేశారు. మొత్తం42 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఆ జాబితాలో యూసుఫ్ పఠాన్‌కు చోటు కల్పించారు. 

తన రాజకీయ ఆరగ్రేటంపై భారత మాజీ క్రికెటర్ నోరు విప్పాడు. అచ్చం రాజకీయ నాయకుడిలా తొలి వాగ్దానం చేశాడు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు టిక్కెట్ ఇచ్చిన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధ్యక్షురాలు మమతా బెనర్జీకి యూసుఫ్ పఠాన్ కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలోని పేద, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంతఃకరణ శుద్ధితో తన కర్తవ్యాన్ని నెరవేరుస్తానని పఠాన్ ధీమా వ్యక్తం చేశారు.

అంతఃకరణ శుద్ధితో పనిచేస్తా.. 

"నన్ను టిఎంసి కుటుంబంలోకి స్వాగతించినందుకు, పార్లమెంట్‌లో ప్రజల గొంతుకగా నిలిచే బాధ్యతతో నన్ను విశ్వసించినందుకు మమతా బెనర్జీకి నేను ఎప్పటికీ కృతజ్ఞుడను. ప్రజాప్రతినిధులుగా పేద, అణగారిన ప్రజల అభ్యున్నతే మా కర్తవ్యం. అదే నేను సాధించాలని ఆశిస్తున్నాను.." అని భారత మాజీ క్రికెటర్ ట్విట్టర్(ఎక్స్‌)లో రాసుకొచ్చారు.