క్షమాపణలు చెప్పిన జొమాటో

క్షమాపణలు చెప్పిన జొమాటో

ప్రముఖ నటుల చేత కొన్ని సంస్థలు యాడ్స్ రూపొందిస్తుంటాయి. అందులో కొన్ని అడ్వర్టైజ్ మెంట్స్ వివాదాస్పదమౌతాయి. దీంతో ఆ యాడ్స్ ను బ్యాన్ చేస్తుంటాయి. తాజాగా.. ఫుడ్ డెలివరీలో పేరొందిన జొమాటో (zomato) రూపొందించిన యాడ్ దుమారం రేపింది. ఈ యాడ్ లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించారు. చివరకు జొమాటో దిగి వచ్చింది. క్షమాపణలు చెప్పడమే కాకుండా యాడ్ ను ప్రదర్శించమని వెల్లడించింది. 

యాడ్ లో ఏముంది ? 
‘ఉజ్జయినిలో నాకు థాలి (నార్త్ ఇండియా ఫుడ్) తినాలనిపిస్తే.. మహాకాల్ నుంచే తెప్పించుకుంటా’ అని హృతిక్ అంటాడు. దీనిపై మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయ పూజారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉజ్జయిని కలెక్టర్, మహాకాల ఆలయ ట్రస్టు ఛైర్మన్ లు జోక్యం చేసుకున్నారు. భక్తులు ఇక్కడి ప్రసాదాన్ని పరమపవిత్రంగా భావిస్తారని.. అలాంటి ఈ యాడ్ మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉందంటూ విమర్శించారు. విమర్శలు ఎక్కువవుతుండడంతో జొమాటో స్పందించింది. ఉజ్జయినిలోని అందరికీ తెలిసిన మహాకాల్ రెస్టారెంట్ కు మాత్రమే సంబంధించిందని పేర్కొంది. ప్రజల మనోభావాలను గౌరవిస్తామని, ఇకపై యాడ్ ను ప్రదర్శించమని ఓ ప్రకటనలో వెల్లడించింది.