
ఎయిర్ ఏషియాకు డీజీసీఏ రూ.20 లక్షల జరిమానా విధించింది. పైలెట్ల శిక్షణ సమయంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించింది. ట్రైనింగ్ సమయంలోనూ పైలట్ల నెపుణ్యతకు సంబంధించిన టెస్ట్(లేదా) ఇన్‌స్ట్రుమెంటేషన్ రేటింగ్ చెక్ తదితరాలను కచ్చితంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే వాటిని కూడా ఎయిర్ ఏషియా చేయడం లేదని డీజీసీఏ తేల్చిన అనంతరం... రూ. 20 లక్షల పెనాల్టీ విధించింది. అంతే కాకుండా ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్‌నీ సస్పెండ్ చేస్తూ.. 3 నెలల పాటు విధుల్లోకి రాకుండా ఆంక్షలు విధించింది. మొత్తం ట్రైనింగ్ టీమ్‌లో ఉన్న ఎగ్జామినర్లకు ఒక్కొక్కరికీ రూ.3 లక్షల చొప్పున ఫైన్ వేసింది. వీటితో పాటు షో కాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. రూల్స్ ఎందుకు పాటించలేదో రాతపూర్వకంగా తెలియజేయాలని ఈ సందర్భంగా డీజీసీఏ ఆదేశించింది.