Beauty Tip : షాంపూ ఇలా వాడాలి.. లేకపోతే జుట్టు ఊడిపోతుంది..!

Beauty Tip : షాంపూ ఇలా వాడాలి.. లేకపోతే జుట్టు ఊడిపోతుంది..!

మీకు షాంపూ వాడేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తారో తెలుసా? ఎన్నో సంవత్సరాలుగా వాడుతున్నాం కదా.. వాటిని వాడడంలో ఇంకా తప్పులు చేస్తామా అనిపించవచ్చు. కానీ నిజానికి చాలామంది షాంపును వాడడంలో చాలా తప్పులు చేస్తుంటారు. అవేంటో చూడండి.

మార్కెట్ లో ఎన్నో రకాల షాంపూలు దొరుకుతున్నాయి. కానీ, వాటిల్లో ఏవి తలకు బాగా సరిపోతాయో తెలియక ఆలోచిస్తుంటారు. ప్రత్యేకించి డ్రై, ఆయిలీ, బ్రిటిల్ వీటిల్లో మీ జుట్టు ఏ రకానికి సంబంధించిందో తెలుసుకోవడం ముఖ్యం. చాలామంది షాంపూ కమ్ కండీషనర్లను వాడుతుంటారు. కాని వాటిని వాడకపోవడమే మంచిదంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. షాంపూ, కండీషనర్ ఒకే దాంట్లో ఉండడం వలన ఏ ప్రయోజనం ఉండదు. అందుకే వాటిని మానేసి అన వసరమైన ఖర్చు తగ్గించుకోవడం మంచిది. షాంపూ వాడడానికి ముందు జుట్టు ఆరి ఉండాలి.

లేదంటే అందులోని రసాయనాలు మీ జుట్టుమీద ప్రభావితం చేస్తాయి. వెంట్రుకల చివర్లే కాకుండా వాటి కుదుర్ల మీద షాంపుని అప్లై చేయాలి. షవర్ కింద ఉన్నప్పుడు జుట్టు చివర్లతో పాటు వాటి కుదుర్ల వరకు శుభ్రమయ్యేలా చేసుకోవాలి. అదేవిధంగా షాంపూను రోజూ కాకుండా రెండు రోజులకు ఒకసారి మాత్రమే వాడటం మంచిది. ఒకవేళ జుట్టు జిగటగా ఉందనిపిస్తే కొద్దిగా డ్రై షాంపూను వాడొచ్చు. ఇలా చేయడం వలన జుట్టు ఆకర్షణీయంగా మారుతుంది.