డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ..ఫిక్కీ వందేళ్ల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తెలంగాణ..ఫిక్కీ వందేళ్ల వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 
  • ఏఐ, క్వాంటం టెక్నాలజీలకు ప్రభుత్వ ప్రాధాన్యం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రాన్ని డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చడమే తమ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ రంగంలో సరికొత్త పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ప్రజల జీవితాల్లో మార్పులు తెచ్చే ఉత్పత్తులు, సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తెలంగాణను2034~35 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకే పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. పరిశోధకులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేసినప్పుడే సాంకేతిక ఆవిష్కరణలకు నిజమైన సార్థకత లభిస్తుందన్నారు. బుధవారం ఆయన బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిర్వహించిన ‘ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) వందేళ్ల వేడుకలు.. తెలంగాణ డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ సమిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో పాల్గొని, మాట్లాడారు. తెలంగాణను పారిశ్రామిక, పెట్టుబడుల గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు సాగుతోందని భట్టి తెలిపారు. 

పాలసీలతో ప్రగతికి సరికొత్త ఊపు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇప్పటికే ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు, ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టు, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ రాష్ట్రానికి ప్రధాన బలాలని డిప్యూటీ సీఎం అన్నారు. వీటికితోడు రీజినల్ రింగ్ రోడ్డు, భారత్ ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీలు పారిశ్రామిక ప్రగతికి సరికొత్త ఊపునిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేర్, ఫార్మా, బయోటెక్నాలజీ, ఏరోస్పేస్, ఇంజినీరింగ్ రంగాల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, వీటిని సమన్వయం చేయడం ద్వారా  ప్రపంచ స్థాయి డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ ఆవిష్కరణలకు తెలంగాణ కేంద్రంగా మారుతుందని భట్టి పేర్కొన్నారు.

అయితే, ల్యాబ్​లలో రూపొందిన ఆవిష్కరణకు తొలి వినియోగదారుడు దొరకడం, క్షేత్రస్థాయి టెస్టింగ్ సదుపాయాలు, నిధుల సమీకరణ వంటి సమస్యలు స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు సవాలుగా మారాయని గుర్తుచేశారు. ఈ అడ్డంకులను అధిగమించేందుకు ఉమ్మడి టెస్టింగ్ కేంద్రాలు, ప్రభుత్వ ప్రయోగాత్మక కొనుగోళ్లతో స్టార్టప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

పారిశ్రామిక వృద్ధి రేటు 8.1 శాతం: మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను గ్లోబల్ డీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్, ఇన్నోవేషన్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా నిలబెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ఐటీ, ఇండస్ట్రీస్​శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సైబర్ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో మౌలిక వసతులు, నైపుణ్యాభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు.‘‘2025–26లో రాష్ట్ర జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీఏలో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధి రేటు నమోదు చేసి రూ.3.04 లక్షల కోట్లకు చేరిందన్నారు.

రాష్ట్ర మర్చండైజ్ ఎగుమతుల్లో 39.3 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించారు. ప్రభుత్వం, పరిశ్రమల సమష్టి భాగస్వామ్యంతోనే రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఫిక్కీ తెలంగాణ చాప్టర్ చైర్మన్ వీవీ రామరాజు, కో-చైర్మన్ జయదేవ్ మీలా, ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీసీసీఐ అధ్యక్షురాలు కేకే మహేశ్వరి, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.