ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయి

ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయి

ఈ ఏడాది దేశంలో 126 పెద్దపులులు చనిపోయాయని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రకటించింది. గత దశాబ్ధ కాలంలో ఈ ఏడాదే అత్యధికంగా పులులు మరణించాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2016లో 121 పులులు చనిపోతే.. ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగిందని తెలిపింది. ప్రపంచంలోనే 75శాతం పులులు ఇండియాలో ఉన్నట్లు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ చెప్పింది. 2006లో దేశంలో 14 వందలకుపైగా పులులు ఉండగా.. 2018 నాటికి ఆ సంఖ్య దాదాపు మూడు వేలకు చేరుకుందని అన్నారు. ప్రతి ఏడాది పులుల మరణాలు పెరుగుతుండటంతో జంతుప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.