- ఒక్క పూణెలోనే 620 కేసులు నమోదు
ముంబయి: రెండు నెలలుగా కరోనాతో అతలాకుతలం అయిన మహారాష్ట్రకు మరో ముప్పు ముంచుకొస్తోంది. ఒకవైపు విలయతాండవం చేస్తున్న కరోనాను కట్టడి చేసేందుకే కిందా మిందా అవుతుంటే... పులిమీద పుట్రలా బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో 1,780 మంది కరోనా రోగులు ప్రస్తుతం 'బ్లాక్ ఫంగస్' చికిత్స పొందుతుండగా మంగళవారం మరో 120 బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. ఒక్క పూణే నగరంలోనే అత్యధికంగా 620 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవగా, 27 మంది మృతి చెందారని ప్రభుత్వం ప్రకటించింది. కరోనా రోగులలో ఫంగల్ ఇన్ఫెక్షన్ పెరిగినట్లు అనుమానాలు కలుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
