వైరల్ వీడియో: ఫ్లయిట్‎లో తండ్రిని చూసి చిన్నారి కేరింత

V6 Velugu Posted on Oct 13, 2021

న్యూఢిల్లీ: పిల్లలు చిన్న చిన్న విషయాలకే చాలా హ్యాపీగా ఫీలవుతారు. అమ్మ లాలిస్తే, నాన్న ఎత్తుకుంటే చాలు చిన్నారులు సంతోషంతో నవ్వుల్లో మునిగిపోతారు. ఇక బైకు, కార్లలో తీసుకెళ్లినప్పుడు పిల్లలు చేసే హడావిడి, వారి కళ్లల్లో కనిపించే ఆనందమే వేరు. అలాంటిది విమానంలో తీసుకెళ్తే చిన్నారుల సంతోషానికి అడ్డుంటుందా? ఆ పిల్లలు ఎంత ఎగ్జయిట్ అవుతారో ఊహించుకోలేం. తాజాగా ఇలాంటి ఓ ఘటన గోఎయిర్ ఫ్లయిట్‌‌లో జరిగింది. ఆ విమానంలో ఢిల్లీకి వెళ్తున్న ఓ చిన్నారి కాక్‌పిట్‌లో ఉన్న తన తండ్రిని చూసి షాకయ్యింది.

తల్లితో కలసి ఫ్లయిట్ ఎక్కిన చిన్నారి.. విమానాన్ని నడిపే పైలట్ డ్రెస్‌లో తన నాన్న గాగుల్స్ పెట్టుకుని నవ్వుతూ హాయ్ చెప్పడంతో సర్‌ప్రైజ్ అయ్యింది. ఆ పాప పేరు శనయ. తన నాన్నను చూడగానే శనయ.. పప్పా అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడిన వీడియో నెట్‌లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో శనయ తల్లి షేర్ చేశారు. శనయా మోతిహర్ పేరు మీద ఉన్న ఈ అకౌంట్‌ను ఆమె మేనేజ్ చేస్తున్నారు. ‘నాన్నతో ఇదే నా తొలి ఫ్లయిట్ జర్నీ. ఆయన నన్ను ఢిల్లీకి తీసుకెళ్లారు. ఆయన్ను చూడటం నాకు చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటివరకు విమాన ప్రయాణాల్లో ఇదే బెస్ట్. లవ్ యూ పప్పా’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ జత చేశారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరూ చూసేయండి. 

మరిన్ని వార్తల కోసం:

పాము కాటుతో భార్యను చంపిన భర్తకు రెండు జీవిత కాలాల శిక్ష

కబడ్డీ ఆడుతున్న బాలికను ఎత్తుకెళ్లి చంపేశారు

సావర్కర్‌ను జాతిపిత చేస్తారేమో?: అసదుద్దీన్ ఒవైసీ

Tagged Girl, father, pilot, GoAir flight, Shanaya, Girl Reaction

Latest Videos

Subscribe Now

More News