పార్లమెంట్ సమావేశాలపై రేపు అఖిలపక్ష భేటీ

పార్లమెంట్ సమావేశాలపై రేపు అఖిలపక్ష భేటీ

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాల నిర్వహణపై రేపు ఆదివారం కేంద్రం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. ఈనెల 19న సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్న విషయం తెలిసిందే. కరోనా నేపధ్యంలో పార్లమెంటు సమావేశాల నిర్వహణ దేశ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ తర్వాత జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త మంత్రులకు పార్లమెంటు సమావేశాలు సవాల్ గా మారాయి. పాత మంత్రులు, శాఖలు మారిన వారు ప్రశ్నలకు దీటుగా సమాధానాలు చెప్పే అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.  మొత్తం 19 రోజుపాటు కరోనా నిబంధనలు పాటిస్తూ సమావేశాలు జరపనుడడంతో చర్చనీయాంశమైన అంశాలే కాదు.. చర్చలు జరిగే తీరు సైతం ఆసక్తికరంగా మారింది.