మంత్రి రోజాకు అస్వస్థత.. చెన్నై అపోలోలో చికిత్స

మంత్రి రోజాకు అస్వస్థత.. చెన్నై అపోలోలో చికిత్స

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని అపోలో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శనివారం( జూన్ 10)  రాత్రి చెన్నైలోని క్రిమ్స్ రోడ్ లోని అపోలో ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఆమెకు కాలు బెణకడంతో వారం రోజుల పాటు ఫిజియోథెరఫీ చేయించారు. అయినా నొప్పి ఎక్కువ కావడంతో   చెన్నై.. థౌజండ్ లైట్స్‌లో ఉన్న అపోలో హాస్పిటల్‌లో చేర్పించారని తెలిసింది. ఆమెకు డాక్టర్లు ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమెకు కాలి నొప్పి తగ్గిందని తెలిసింది. త్వరలోనే ఆమెను డిశ్చార్జ్ చేస్తారని సమాచారం.  ఈ కారణంగానే పది రోజుల పాటు నియోజక వర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటున్నారని పార్టీ నేతలు అంటున్నారు. 

నగరి నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజా... ఏపీలో రెండోసారి మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు పర్యాటక మంత్రి అయ్యారు. ఐతే.. ఈ కారణంగా ఆమె ఏపీతోపాటూ... దేశ, విదేశాల్లోని పర్యాటక ప్రదేశాలకు వెళ్లి వస్తున్నారు. అప్పుడప్పుడూ టూరిజంపై అధికారులతో చర్చిస్తున్నా... ఏపీలో మాత్రం టూరిజం అంతగా అభివృద్ధి చెందట్లేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షాల విమర్శల్ని తరచూ వైసీపీ నేతలు ఖండిస్తున్నారు. స్వయంగా ఫైర్ బ్రాండ్ అయిన రోజా సైతం.. తరచూ విపక్ష నేతలపై ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తరచూ ఆమె విమర్శలు చేస్తున్నారు. అందుంవల్ల ఆమె సోషల్ మీడియాలో తరచూ ట్రెండింగ్‌లో ఉంటున్నారు.