ఏపీలో కొనసాగుతున్న టీచర్ల నిరసనలు

ఏపీలో కొనసాగుతున్న టీచర్ల నిరసనలు
  • నల్ల బ్యాడ్జీలతో విధులు

అమరావతి:  పీఆర్సీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగ సంఘాలు సమ్మె విరమించినా.. టీచర్లు మాత్రం నిరసనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చల సందర్భంగా ఫిట్మెంట్ పై కనీసం చర్చకు అనుమతించకపోవడంపై ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పోరాటం దశలవారీగా కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO) పిలుపునిచ్చింది.  ఈ పోరాటంలో కలిసి వచ్చే సంఘాలను కలుపుకుని ఐక్యవేదిక ఏర్పాటు చేస్తామని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి.

ఫ్యాప్టో పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా టీచర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. పాఠశాల ప్రాంగాణాల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్సీలో 27 శాతం కంటే ఎక్కువగా ఫిట్మెంట్  సాధనకు.. CPS రద్దు చేయాలని, ఇతర సమస్యల పరిష్కారం కోసం దశల వారి పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు ఒత్తిళ్లకు లొంగి తమకు అన్యాయం చేశాయని.. భవిష్యత్తులో వారు ఉద్యమాలు చేస్తే ఎవరూ నమ్మే పరిస్థితి ఉండదన్నారు. 

 

మరిన్ని వార్తల కోసం:

జేఎన్‌యూ వీసీగా తెలుగు మహిళ

ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

నో వర్క్ ఫ్రమ్ హోం.. ఆఫీసులకు రావాల్సిందే