అగ్నివీర్ల భర్తీకి జూలై నుంచి రిజిస్ట్రేషన్లు

అగ్నివీర్ల భర్తీకి జూలై నుంచి రిజిస్ట్రేషన్లు

‘అగ్నిపథ్’ స్కీమ్ లో భాగంగా ఆర్మీలో సైనికుల నియామకానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ను  సైన్యం సోమవారం విడుదల చేసింది. జూలై నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలతుందని వెల్లడించింది. భారత సైన్యంలోకి ప్రవేశించాలనుకునే వారికి అగ్నిపథ్ స్కీమ్ ఒక్కటే మార్గమని నోటిఫికేషన్ లో ప్రస్తావించారు. కేవలం సైన్యంలోని మెడికల్ బ్రాంచ్ కు చెందిన టెక్నికల్ క్యాడర్ భర్తీ ప్రక్రియ కోసం మాత్రమే ప్రత్యేక నోటిఫికేషన్లు వెలువడుతాయని స్పష్టం చేశారు. కాగా, భారత నౌకాదళంలో అగ్ని వీర్ల భర్తీకి జూన్ 21న, వాయుసేనలో భర్తీకి జూన్ 24న నోటిఫికేషన్లు వెలువడుతాయని ట్విటర్ హ్యాండిల్ లో ఆర్మీ ప్రకటించింది. దరఖాస్తు చేసుకోవాలని భావించే వారు తప్పకుండా త్రివిధ దళాల వెబ్ సైట్ లలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి అని నిర్దేశించింది.