కక్షగట్టి కావాలనే అరెస్టు చేశిర్రు: మహారాష్ట్ర మంత్రి

కక్షగట్టి కావాలనే అరెస్టు చేశిర్రు: మహారాష్ట్ర మంత్రి

ముంబై: డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ ప్రాథమిక హక్కులను రక్షించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ నమోదైంది. శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి కిషోర్ తివారీ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోలో పని చేస్తున్న ఓ అధికారి భార్య సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమైందని.. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆర్యన్ లాంటి వారిని అరెస్టు చేస్తున్నారని తన పిటిషన్‌లో కిషోర్ పేర్కొన్నారు. కావాలనే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు, మోడళ్లను టార్గెట్‌ చేస్తున్నారని.. ఆర్యన్ ప్రాథమిక హక్కులను కాపాడాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్లు మెడికల్ రిపోర్టు లేదని, ఎలాంటి ఇతర ఆధారాలు లేకున్నా అతడ్ని రోజుల తరబడి జైలులో ఉంచుతున్నారని కిషోర్ అన్నారు. కాగా, డ్రగ్స్ కేసులో ఆర్యన్‌తోపాటు పలువురిని ఎన్‌సీబీ అరెస్టు చేసింది. అయితే ఈ కేసును లీడ్ చేస్తున్న ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేను టార్గెట్‌గా చేసుకునే కిషోర్ సుప్రీంలో పిటిషన్ వేశారని తెలుస్తోంది. సమీర్ భార్య మరాఠీ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కావడం దీన్ని మరింత బలపరుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం: 

భర్తపై అనుమానంతో జిమ్‌లో చితకబాదిన భార్య!

సౌండ్ చేశారో.. సైలెన్సర్ నలిగిపోద్ది..

సోల్జర్స్ చనిపోతుంటే.. పాక్‎తో టీ20 మ్యాచ్ ఆడతారా?: అసదుద్దీన్ ఒవైసీ