చైనాకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు.. అదానీ శ్రీలంక పోర్ట్‌‌‌‌‌‌‌‌కు యూఎస్ సాయం

చైనాకు చెక్‌‌‌‌‌‌‌‌ పెట్టేందుకు.. అదానీ శ్రీలంక పోర్ట్‌‌‌‌‌‌‌‌కు యూఎస్ సాయం
  • రూ.4,590 కోట్లు లోన్ ఇవ్వనున్న డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ

న్యూఢిల్లీ శ్రీలంకలో అదానీ గ్రూప్ డెవలప్ చేస్తున్న పోర్ట్‌‌‌‌‌‌‌‌కు యూఎస్‌‌‌‌‌‌‌‌ ఆర్థిక సాయం చేయడానికి ముందుకొచ్చింది. అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌తో కూడిన కొలంబో వెస్ట్ ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ టెర్మినల్‌‌‌‌‌‌‌‌ (సీడబ్ల్యూఐటీ) కన్సార్టియంకు యూఎస్ ప్రభుత్వానికి చెందిన డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్ ఫైనాన్స్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూషన్ డీఎఫ్‌‌‌‌‌‌‌‌సీ 553 మిలియన్ డాలర్ల  (రూ.4,590 కోట్ల) ఆర్థిక సాయం చేయనుంది. శ్రీలంకలో చైనాకు అడ్డుకట్ట వేసేందుకే యూఎస్ రంగంలోకి దిగిందని నిపుణులు చెబుతున్నారు.

ఈ ఫండ్‌‌‌‌‌‌‌‌తో కొలంబో పోర్టులో కొత్త డీప్‌‌‌‌‌‌‌‌ వాటర్ షిపింగ్ కంటైనర్ టెర్మినల్‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయడానికి వీలుంటుందని అదానీ పోర్ట్స్  ఓ స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌లో పేర్కొంది. ప్రైవేట్ సెక్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీలంకలో ఇన్వెస్ట్ చేయడానికి ఈ పోర్టు సాయపడుతుందని అభిప్రాయపడింది. శ్రీలంకలో స్మార్ట్, గ్రీన్ పోర్టులు వంటి సస్టయినబుల్‌‌‌‌‌‌‌‌ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డెవలప్ చేయడానికి  యూఎస్, శ్రీలంక, ఇండియా  పార్టనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్ కుదుర్చుకున్నాయని అదానీ పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ వివరించింది. కాగా,  లోన్లు, ఇతర మార్గాల్లో ఆర్థిక సాయం చేస్తూ శ్రీలంకలోకి చైనా చొచ్చుకుపోయింది. హంబంటోట పోర్ట్‌‌‌‌‌‌‌‌ కోసం చైనా బిలియన్ డాలర్లు ఆర్థిక సాయం చేయగా, ఈ పోర్ట్‌‌‌‌‌‌‌‌ శ్రీలంక ప్రభుత్వానికి నష్టాలే మిగిల్చింది. ఈ అప్పు   తీర్చడంలో డీఫాల్ట్‌‌‌‌‌‌‌‌ అయ్యింది.