బ్లూ స్టార్ నుంచి కొత్త సిరీస్‌ డీప్‌ ఫ్రీజర్లు 

బ్లూ స్టార్ నుంచి కొత్త సిరీస్‌ డీప్‌ ఫ్రీజర్లు 

హైదరాబాద్‌‌, వెలుగు: రిఫ్రిజిరేటర్ల తయారీ కంపెనీ బ్లూ స్టార్ గురువారం హైదరాబాద్‌‌లో కొత్త సిరీస్‌ డీప్ ఫ్రీజర్లను లాంచ్ చేసింది. వీటి కెపాసిటీ 60 లీటర్ల నుంచి 600 లీటర్ల మధ్య ఉంది. 47 డిగ్రీల టెంపరేచర్స్ ఉన్నా, ఈ డీప్ ఫ్రీజర్లు చక్కగా పనిచేస్తాయని కంపెనీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. 160 వోల్ట్స్‌‌ నుంచి 270 వోల్ట్స్ మధ్య వీటి  వోల్టేజ్ రేంజ్ ఉంది. ధర రూ.16 వేల నుంచి మొదలవుతోంది.

డీప్ ఫ్రీజర్లను మహారాష్ట్రలోని వాడా ప్లాంట్‌‌లో కంపెనీ తయారు చేస్తోంది. 2024–25 లో  కమర్షియల్ రిఫ్రిజిరేషన్ మార్కెట్‌‌  15 శాతం గ్రోత్ నమోదు చేస్తుందని, తాము 20 శాతం గ్రోత్ సాధిస్తామని కంపెనీ ఎండీ బీ త్యాగరాజన్ అన్నారు. శ్రీ సిటీ (ఆంధ్రా)  ప్లాంట్ కెపాసిటీని 2025–26 నాటికి 12 లక్షల యూనిట్లకు పెంచుతామన్నారు.