బోనాల వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం

బోనాల వేడుకల్లో పోలీసుల అత్యుత్సాహం
  • ఓ యువకుడిని కొట్టిన పోలీసులు
  • బీజేపీ కార్యకర్తలకూ సేమ్ ​ట్రీట్మెంట్​
  • మీడియా పాస్​ల జారీలోనూ గందరగోళం 

పద్మారావునగర్, వెలుగు: లష్కర్​బోనాల వేడుకల్లో కొందరు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆదివారం అమ్మవారి దర్శనం కోసం లైన్లలో నిల్చున్న ఓ యువకుడితో పాటు స్థానిక బీజేపీ కార్యకర్తపైనా పోలీసులు చేయిచేసుకోవడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారి దర్శనానికి రాగా, తనను పక్కకి లాక్కెళ్లి కొట్టారని సదరు యువకుడు వాపోయాడు. అలాగే, ఆదివారం రాత్రి స్థానిక బీజేపీ కార్యకర్త సందీప్​సాగర్​తన కుటుంబసభ్యులతో దర్శనానికి రాగా ఇదే ట్రీట్​మెంట్​ఇచ్చారు. 

ఇక ఈ ఏడాది మీడియా పాస్​ల జారీలో పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. ప్లాన్​ప్రకారం పాస్​లు ఇవ్వాల్సి ఉండగా, అవేవీ పట్టించుకోకుండా ఫస్ట్​కమ్​ఫస్ట్​సర్వ్​లా ఎవరు ముందు వస్తే వారికే పాస్​లు ఇచ్చారు. దీంతో పలు మీడియాలకు సంబంధించిన జర్నలిస్టులు వెళ్తే పాస్​లు అయిపోయాయని  తిప్పి పంపారు. డీపీఆర్​వో నుంచి  తమ పేర్లు వచ్చినా, తమ దగ్గర అక్రిడిటేషన్​కార్డులు ఉన్నా పోలీసులు పాస్​లు ఇవ్వలేదని పలువురు మీడియా ప్రతినిధులు వాపోయారు.