53 మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

53 మంది అభ్యర్థులతో బీఎస్పీ తొలి జాబితా విడుదల

యూపీలో ఎన్నికల సందడి నెలకొంది. వరుసగా పార్టీలు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నారు. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి తమ పార్టీకి చెందిన అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేశారు. 53 అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. మరో ఐదుమంది అభ్యర్థుల పేర్లను మరో రెండు రోజుల్లో ప్రకటిస్తామని మాయావతి తెలిపారు. అయితే బీఎస్పీ సుమారు 100 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే మొదటి విడత ఎన్నికల అభ్యర్థుల్ని మాత్రమే ప్రకటించడం విశేషం. ఈ ఏడాది ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఎన్నికల ఫలితాల అనంతరమే పొత్తును ఉపసంహరించుకున్నారు.

మరోవైపు ఇప్పటికే యూపీలో ఎస్పీ,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. కాంగ్రెస్ పార్టీ 125 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ) కూటమి  వచ్చే యూపీ అసెంబ్లీ ఎన్నికల కోసం 29 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. పశ్చిమ యూపీలోని స్థానాల అభ్యర్థుల లిస్ట్ వెల్లడించింది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 10 మరియు 14 తేదీల్లో మొదటి రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 29 స్థానాల్లో ఆర్‌ఎల్‌డీ 19 స్థానాల్లో పోటీ చేయనుండగా, ఎస్పీ 10 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.మొత్తం  ఏడు విడతల్లో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మార్చి 10 న విడుదల కానున్నాయి.

ఇవి కూడా చదవండి: 

ఢిల్లీలో ఘనంగా 74 ఆర్మీ డే సెలబ్రేషన్స్

సైబర్ ఎటాక్.. పనిచేయని ప్రభుత్వ వెబ్ సైట్లు