అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది

అతడి సరాదా.. కోట్లు తెచ్చిపెడుతోంది

గూగుల్లో 300 బగ్లు కనిపెట్టి 65కోట్లు సొంతం చేసుకున్నాడు యువ టెకీ అమన్ పాండే. చిన్ననాటి నుంచే ఏదో ఒకటి కొత్తది క్రియేట్ చేయాలనో లేదా కొత్తది ఏదైనా కనిపెట్టాలన్న ఆలోచనలతో  సరదాగా వెబ్ సైట్లు.. యాప్ లలో తప్పులు కనిపెట్టేవాడు. ఆ  సరదాయే ఇప్పుడు అతనికి కోట్లు కురిపిస్తోంది. తొలుత గూగుల్ అతడి ప్రతిభను గుర్తించి 70వేలు పారితోషికం ఇవ్వడం ఇతడి జీవితాన్ని మలుపు తిప్పింది. ఈ రంగంలో అపార అవకాశాలున్నట్లు గుర్తించి బీటెక్ కోర్సు పూర్తి కాగానే సొంత స్టార్టప్ కంపెనీ ఏర్పాటు చేశాడు.  మరో 15 మంది ఉద్యోగులను నియమించుకుని  ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ కంపెనీల నుంచి వరుస ఆఫర్లు అందుకుంటుూ బిజీగా మారాడు.

మధ్యప్రదేశ్ లోని భోపాల్ ఎన్.ఐ.టి లో బీటెక్ పూర్తి చేసిన అమన్ పాండే స్వస్థలం ఉత్తరాఖండ్.  చిన్నప్పటి నుంచి తన ప్రత్యేకతను చాటుకోవాలనే తహతహ ఎక్కువ. ఇంజనీరింగ్ కోర్సులో చేరిన తర్వాత సరదాగా రకరకాల యాప్ లు.. వెబ్ సైట్లలో తప్పులు కనిపెట్టేవాడు. ఈ అలవాటును  2019లో గూగుల్ గుర్తించింది. తమ అప్లికేషన్లలో ఒక బగ్ ను కనిపెట్టినందుకు గూగుల్ అమన్ పాండేకు రూ.70వేలు పారితోషికం ఇచ్చింది. దీంతో ఇటువైపు మరింత సీరియస్ గా దృష్టి పెట్టిన అమన్ పాండే..  బగ్స్ మిర్రర్ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. వరుసగా ఆర్డర్లు వస్తుండడంతో 2021లో తన కంపెనీని రిజిస్టర్ చేసుకుని మరో 15మంది ఉద్యోగులను నియమించుకున్నాడు. తాజాగా 300 బగ్లు కనిపెట్టి 65 కోట్లు సొంతం చేసుకున్నాడు. తన స్టార్టప్‌ను మిలియన్ డాలర్ల కంపెనీగా మలచుకున్నాడు. 
తన స్టార్టప్‌ కంపెనీ మిలియన్ డాలర్ల కంపెనీగా మారడంతో మరింత బాధ్యత పెరిగిందంటున్నాడు అమన్ పాండే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) భోపాల్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన తాను.. 2021లో తన కంపెనీని రిజిస్టర్ చేసుకున్నానని వివరించారు. గూగుల్, శాంసంగ్ మరియు యాపిల్ వంటి బహుళజాతి క్లయింట్‌ల ఉత్పత్తులు మరియు సేవలలో బగ్‌లను, ప్రోగ్రామ్లలోని లొసుగులను కనుగొనడానికి, డేటాను భద్రపరచడాని ప్రాజెక్ట్‌లను తీసుకున్నానని చెప్పారు. శాంసంగ్, యాపిల్ వంటి కంపెనీల అప్లికేషన్‌లలో కూడా బగ్‌లను గుర్తించామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు మాకు అంతర్జాతీయ క్లయింట్లు మాత్రమే ఉన్నారు, కానీ ఇప్పుడు భారతీయ కస్టమర్లు కూడా తమ ఉత్పత్తుల భద్రత, ఆడిట్‌ల కోసం మా వద్దకు వస్తున్నారని ఆయన చెప్పారు. గూగుల్ నుంచి అందిన మొత్తాన్ని సరైన దిశలో ఉపయోగించుకుని మరింత మెరుగైన పని చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు అమన్ తెలిపారు. మీకు స్ఫూర్తి ఎవరని ప్రశ్నిస్తే రతన్ టాటా మరియు ఎలన్ మస్క్‌ అని అమన్ పాండే తెలిపారు.

ఇవి కూడా చదవండి

గ్రానైట్​ అక్రమ రవాణాపై సీబీఐ పూర్తిస్థాయి ఎంక్వైరీ షురూ

విశ్లేషణ: విలువలు లేనిపార్టీలు.. పట్టింపు లేని ప్రభుత్వం

సున్నిపిండి స్నానంతో కలిగే బెనిఫిట్స్ ఇవే..

విశ్లేషణ: బహుశా కేసీఆర్ ధైర్యశాలి కావొచ్చు