కార్ల అమ్మకాలు జూన్​లో పుంజుకున్నయ్

కార్ల అమ్మకాలు జూన్​లో పుంజుకున్నయ్
  • జులైలోనూ ఇదే ట్రెండ్​ ఉంటుందని ఆశ
  •  కష్టాల నుంచి పూర్తిగా బయటపడలేదు

న్యూఢిల్లీ: ఈ ఏడాది మే నెలతో పోలిస్తే జూన్​ నెలలో ఆటోమొబైల్​ రిటెయిల్​ సేల్స్​ పుంజుకున్నాయి. కొవిడ్​–19 సెకండ్​వేవ్​ ఎఫెక్ట్​తో ఏప్రిల్​, మే నెలల్లో ఆటోమొబైల్​ రిటెయిల్​ సేల్స్​ పడిపోయిన విషయం తెలిసిందే. లాక్​డౌన్​ రెస్ట్రిక్షన్లను వివిధ రాష్ట్రాలు తీసేయడంతో వెహికల్​ రిజిస్ట్రేషన్స్​ జూన్​ నెలలో పెరిగినట్లు ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్​ (ఫాడా) ప్రకటించింది. జూన్​ నెలలో పాసింజర్​ వెహికల్స్​ అమ్మకాలు 1,84,134 యూనిట్లకు పెరిగాయని, మే నెలలో అవి 85,733 యూనిట్లు మాత్రమేనని ఫాడా వెల్లడించింది. దేశంలోని 1,295 రీజినల్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసుల నుంచి ఫెడరేషన్​ ఆఫ్​ ఆటోమొబైల్​ డీలర్స్​ అసోసియేషన్​ (ఫాడా) ఈ డేటాను సేకరిస్తోంది. మన దేశంలో మొత్తం 1,498 రీజినల్​ ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసులున్నాయి. మే నెలతో పోలిస్తే జూన్​ నెలలో టూ వీలర్​ సేల్స్​ కూడా బాగా పెరిగాయని ఫాడా డేటా వెల్లడిస్తోంది. జూన్​ 2021లో టూ వీలర్​ అమ్మకాలు 9,30,324 యూనిట్లకు పెరిగాయి. అంతకు ముందు నెలలో ఈ అమ్మకాలు 4,10,757 యూనిట్లే. ఇక కమర్షియల్​ వెహికల్స్​ సేల్స్​ కూడా జూన్​ నెలలో 35,700 యూనిట్లకు చేరింది. జూన్​ నెలలో  త్రీ వీలర్​ సేల్స్​ 14,732 యూనిట్లకు, ట్రాక్టర్​ సేల్స్​ 52,261 యూనిట్లకు పెరిగాయి. అన్ని కేటగిరీలలోనూ కలిపి రిజిస్ట్రేషన్ల సంఖ్య 12,17,151 కి చేరింది. దక్షిణాదిలోని కొన్ని రాష్ట్రాలు తప్పిస్తే, మిగిలిన చాలా రాష్ట్రాలలో రెస్ట్రిక్షన్లు ఎత్తివేయడంతో ఆటోమొబైల్​ వెహికల్స్​ అమ్మకాలు జూన్​ నెలలో రికవరయ్యాయని ఫాడా ప్రెసిడెంట్​ వింకేష్​ గులాటి చెప్పారు. పెంటప్​ డిమాండ్​ పుంజుకుందని అన్నారు. సోషల్​ డిస్టెన్సింగ్​, సేఫ్టీ కారణాలతో సొంత వాహనాల కొనుగోలుకు ఇష్టపడుతున్నారని పేర్కొన్నారు.  రూరల్​ మార్కెట్లు పూర్తి నార్మల్​ కాకపోవవడంతో టూ వీలర్​ సేల్స్​ రికవరీ కొంత స్లోగా ఉందని చెప్పారు. 
ఇంకా సమస్యలు పోలే!
ఆటోమొబైల్​ ఇండస్ట్రీ ఇంకా కష్టాల నుంచి బయటపడలేదని, కిందటేడాది జూన్​తో పోలిస్తే ఈ ఏడాది జూన్​ సేల్స్​ 28 శాతం తక్కువని వింకేష్​ గులాటి తెలిపారు. త్రీ వీలర్, కమర్షియల్​ వెహికల్స్​ అమ్మకాలైతే బాగా పడిపోయాయని పేర్కొన్నారు. జూన్​ 2019తో పోలిస్తే ఈ ఏడాది జూన్​లో ఒక్క ట్రాక్టర్ల అమ్మకాలు మాత్రమే 27 శాతం పెరిగాయని వెల్లడించారు. జులై నెలలోనూ ఇదే ట్రెండ్​ కొనసాగుతుందని చెప్పారు. సెమికండక్టర్ల కొరతతో పాసింజర్​ వెహికల్స్​ గ్రోత్​ పరిమితమవుతోందని చెప్పారు. మరోవైపు కొత్త మ్యూటెంట్లు, థర్డ్​వేవ్​ భయాలు సెంటిమెంట్​పై ఎఫెక్ట్​ చూపిస్తున్నాయని అన్నారు. వ్యాక్సినేషన్​ ఊపందుకోవడంతోపాటు, మాన్సూన్​ మెరుగ్గా ఉంటుందనే అంచనాలతో జులై సేల్స్​ మెరుగ్గా ఉంటాయని  తెలిపారు.​ ఫాడాలో 15 వేల మంది ఆటోమొబైల్​ డీలర్లు మెంబర్లుగా ఉన్నారు.