ఇచ్చిన టైం కన్నా ఎక్కువ సేపు కాల్చారు.. అమ్మారు.. 581 కేసులు నమోదు

ఇచ్చిన టైం కన్నా ఎక్కువ సేపు కాల్చారు.. అమ్మారు.. 581 కేసులు నమోదు

తమిళనాడులో నిబంధనలను ఉల్లంఘించి, అనుమతించిన సమయానికి మించి పటాకులు పేల్చడం, అధిక డెసిబుల్ బాణసంచా పేల్చడం, బాణాసంచా దుకాణాలను నడుపుతున్న వ్యక్తులపై గ్రేటర్ చెన్నై సిటీ పోలీసులు మొత్తం 581 కేసులు నమోదు చేశారు.

దీపావళికి ముందు, పోలీసులు నిర్ణీత సమయ వ్యవధిలో పటాకులు పేల్చాలని ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వనుంచి రాత్రి 8గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని సూచించారు. అలాగే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పర్యావరణ అనుకూల రసాయనాలతో తయారు చేసిన గ్రీన్ క్రాకర్లను మాత్రమే విక్రయించవచ్చు,పేల్చవచ్చు. ఎన్విరాన్‌మెంట్ (రక్షణ) రూల్స్, 1986లోని రూల్ 89 ప్రకారం, 125 డెసిబుల్స్ కంటే ఎక్కువ ధ్వనిని ఉత్పత్తి చేసే పటాకులను తయారు చేయడం, ఉపయోగించడం లేదా విక్రయించడం చట్ట రిత్యా నేరం.