బార్డర్‌‌‌‌‌‌‌‌లో బలగాల కోసం చైనా బిల్డింగ్స్

బార్డర్‌‌‌‌‌‌‌‌లో బలగాల కోసం  చైనా బిల్డింగ్స్

న్యూఢిల్లీ: బార్డర్​లో చైనా మళ్లీ నిర్మాణాలు చేపట్టింది. బలగాల కోసం బిల్డింగులు కడుతోంది. కాంక్రీట్​తో పర్మనెంట్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది. నార్త్ సిక్కింలోని నకు లా ఏరియాకు కొద్ది కిలోమీటర్ల దూరంలోనే చైనా ఈ క్యాంపును కడుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తూర్పు లడఖ్, అరుణాచల్ ప్రదేశ్ లోనూ మన భూభాగానికి దగ్గర్లో క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పాయి. బార్డర్ లో గొడవలు జరిగినప్పుడు, తమ బలగాలను తొందరగా అక్కడికి పంపేందుకు చైనా ఈ పని చేస్తోందని పేర్కొన్నాయి. డ్రాగన్ కంట్రీ కొన్నేండ్లలో బార్డర్ వెంట రోడ్లను కూడా నిర్మించిందని వివరించాయి. పర్మనెంట్ క్యాంపుల ఏర్పాటుతో చైనా బలం పెరుగుతుందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చైనా యాక్టివిటీలపై మన దేశ ఏజెన్సీలు కన్నేసి ఉంచాయని చెప్పాయి. బార్డర్ లో చలికాలంలో ఉండే వాతావరణ పరిస్థితులను చైనా బలగాలు తట్టుకోలేకపోతున్నాయి. ఆ పరిస్థితులను అధిగమించి, తమ బలగాలను ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికైనా తరలించేందుకు చైనా అన్ని సౌలతులతో ఈ క్యాంపులు నిర్మిస్తోంది.