తైవాన్ చుట్టూ చైనా చక్కర్లు

తైవాన్ చుట్టూ చైనా చక్కర్లు
  • తైవాన్ తీరంలో చైనా విన్యాసాలు

చైనాకు చెందిన 21 యుద్ధ విమానాలు, 5 యుద్ధ నౌకలు  తైవాన్ తీరంలో విన్యాసాలు చేపడుతున్నాయి. ప్రతిరోజు తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతూ రెచ్చగొట్టే విన్యాసాలు చేస్తున్న చైనా.. అదను చూసి తైవాన్ జలాల్లోకి చొరబడుతోంది. నిన్న శుక్రవారం 8 చైనా జెట్విమానాలు తైవాన్ జలాల్లోకి చొరబడినట్లు గుర్తించామని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ చెబుతోంది. చైనా మిలిటరీకి చెందిన 17 విమానాలు, 5 నౌకలను తాము గుర్తించామని వెల్లడించింది.

పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన 17 ఫ్లైట్లు తైవాన్ జలసంధిని దాటినట్లు తెలిపింది. చైనా విమానాల్లో ఎయిర్ క్రాఫ్ట్ జియాన్  జేహెచ్-7 ఫైటర్ బాంబర్లు, రెండు సుఖోయ్ సు-30 ఫైటర్లు, రెండు షెన్యాంగ్ జే- 11 (షెన్యాంగ్ జే - 11)   జెట్స్ ఉన్నట్లు తెలిపింది. సౌత్ వైపున్న మీడియన్ లైన్ ను 2 యుద్ధవిమానాలు క్రాస్ చేసినట్లు తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది.